సీఎం చంద్రబాబుతో ఉబర్ ప్రతినిధుల భేటీ
ఉబర్ (Uber) గ్లోబల్ లీడర్ షిప్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ను కలిశారు. ఉబర్ సీఈవో దారా ఖొస్రోషాహీ (Dara Khosrowshahi) నేతృత్వలోని బృందంతో జరిగిన చర్చల్లో సాంకేతికత, మొబిలిటీ, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిపై చర్చించారు. పట్టణ రవాణా వ్యవస్థ వంటి విస్తృతమైన అంశాలపై తమ మధ్య చర్చ జరిగిందని లోకేశ్ తెలిపారు. భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఇటువంటి ప్రపంచ స్థాయి నాయకులతో ఆలోచనలను పంచుకోవడం ఎప్పుడూ నూతన ఉత్తేజాన్నిస్తుందని లోకేశ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి






