ముంచుకొస్తున్న ఆయిల్ ముప్పు.. కార్లు వదిలి మెట్రోలో కేంద్ర మంత్రులు..!
పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాకు గుండెలాంటి ‘హోర్ముజ్ జలసంధి’ మూసుకుపోవడంతో చమురు, ఎల్పీజీ సరఫరాకు భారీ బ్రేక్ (Oil Crisis) పడింది. మన దేశం తన ముడిచమురు అవసరాల్లో ఏకంగా 85 శాతం విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడుతోంది. ఈ క్రమంలోనే “కోవిడ్ నాటి పొదుపు పద్ధతులను” మళ్లీ పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ మే 11న దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే జనం పొదుపు చేయాలంటున్న నేతలు.. భారీ వీఐపీ కాన్వాయ్‌లతో ఎందుకు తిరుగుతున్నారన్న విమర్శలు నెటిజన్ల నుంచి వెల్లువెత్తాయి. దీంతో పరిస్థితుల తీవ్రతను గ్రహించిన ప్రధాని మోడీతో పాటు బీజేపీ అగ్రనేతలు, ముఖ్యమంత్రులు రంగంలోకి దిగి తాము కూడా పొదుపు విధానాలను ఆచరించి చూపిస్తున్నారు.
సగానికి తగ్గిన ప్రధాని కాన్వాయ్!
ధర్మం ఇంటి నుంచే ప్రారంభం కావాలన్న నానుడిని నిజం చేస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీ వీఐపీ ఆడంబరాలకు స్వస్తి పలికారు. తన భద్రతా కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను ఏకంగా 50 శాతానికి కుదించేశారు. అంతేకాదు ఇంధనాన్ని ఆదా (Oil Crisis) చేసే పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాలను (EVs) వాడాలని అధికారులను ఆదేశించారు. దేశ హోంమంత్రి అమిత్ షా సైతం తన కాన్వాయ్‌ను 11 వాహనాల నుంచి కేవలం 5కు తగ్గించుకుని ఆదర్శంగా నిలిచారు. ఇక కేంద్ర మంత్రులు కపిల్ మిశ్రా, రాందాస్ అథవాలే ఏకంగా తమ కార్లను పక్కనపెట్టి బుధవారం నాడు సామాన్యుల్లా మెట్రో రైళ్లలో ఆఫీసులకు వెళ్లడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి
రాష్ట్రాల్లో పొదుపు మంత్రం
మహారాష్ట్ర ప్రభుత్వం పొదుపు విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంది. మంత్రులు అనవసర విమాన ప్రయాణాలు మానుకుని (Oil Crisis) వర్చువల్ మీటింగ్‌లకు పరిమితం కావాలని ఆదేశించింది. దీంతో మంత్రి ఆశిష్ షెలార్ ఫ్రాన్స్‌లో జరిగే ప్రతిష్టాత్మక ‘కేన్స్ ఫిలిం ఫెస్టివల్’ పర్యటనను రద్దు చేసుకోగా, మరో మంత్రి శంభురాజ్ దేశాయ్ తన ఫ్యామిలీ యూరప్ ట్రిప్‌ను పక్కనపెట్టేశారు. 22 మంది ఎమ్మెల్యేల జపాన్ టూర్ కూడా దాదాపు రద్దయినట్లే.
ఉత్తరప్రదేశ్: సీఎం యోగి ఆదిత్యనాథ్ తన మంత్రుల కాన్వాయ్‌లపై ఏకంగా 50 శాతం కోత విధించారు. లక్నో మేయర్ సుష్మా ఖార్ఖవాల్ తనకు కేటాయించిన ప్రభుత్వ వాహనాన్ని తిరిగి ఇచ్చేశారు.
గుజరాత్: సీఎం భూపేంద్ర పటేల్ కేవలం మూడు వాహనాలతోనే ప్రయాణిస్తున్నారు. ఆ రాష్ట్ర గవర్నర్ హెలికాప్టర్ పర్యటనలు మానేసి.. రైళ్లు, బస్సుల్లో ప్రయాణించాలని (Oil Crisis) నిర్ణయించడం విశేషం. విద్యార్థులు ఈవీలు, సైకిళ్లు వాడాలని ఆయన సూచించారు.
మధ్యప్రదేశ్: ముఖ్యమంత్రి కాన్వాయ్ సైతం 13 వాహనాల నుంచి 8కి తగ్గించారు.
బంగారం కొనకండి.. పెళ్లిళ్లు వాయిదా వేసుకోండి!
ఇప్పటికే చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇంధన కొరతను తట్టుకునేందుకు రేషనింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలను అమలు చేస్తున్నాయి. మన విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడం ఇప్పుడు మన దేశానికి (Oil Crisis) అత్యంత కీలకం. అందుకే ప్రధాని మోడీ మే 11న దేశ ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. ప్రైవేట్ వాహనాలకు బదులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని, ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మళ్లీ ప్రారంభించాలని కోరారు. ముఖ్యంగా విదేశీ మారక ద్రవ్యం ఆదా చేసేందుకు.. రాబోయే ఏడాది పాటు ప్రజలు ‘బంగారం కొనుగోళ్లు’ నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా విదేశీ పర్యటనలు, కోట్లు వెచ్చించి చేసే డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి ఆడంబరపు వేడుకలను వాయిదా వేసుకోవాలని ప్రధాని సూచించడం ప్రస్తుత సంక్షోభ (Oil Crisis) తీవ్రతకు అద్దం పడుతోంది.
ఇవి కూడా చదవండి






