జాన్వీ అందుకే పెద్ది ప్రమోషన్స్ ను లైట్ తీసుకుంటుందా?
దివంగత నటి శ్రీదేవి(Sridevi) వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్(Janhvi kapoor), బాలీవుడ్లో గ్లామర్‌తో పాటు నటనతో కూడా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. అయితే ఆమె కెరీర్‌కు ఇప్పటివరకు ఒక భారీ కమర్షియల్ బ్రేక్ మాత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలోనే జాన్వీ దృష్టి ఇప్పుడు దక్షిణాది సినిమాలపై, ముఖ్యంగా తెలుగు ప్రాజెక్టులపై మరింతగా కేంద్రీకృతమైందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్(Ram Charan) హీరోగా బుచ్చిబాబు సాన(Buchi Babu Sana) తెరకెక్కిస్తున్న పెద్ది(Peddi) సినిమాలో ఆమె హీరోయిన్గా నటిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ పాత్ర కొత్తగా ఉండబోతుందనే టాక్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
ఇవి కూడా చదవండి
అయితే ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో జాన్వీ వ్యవహరిస్తున్న తీరుపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇటీవల కొన్ని మీడియా వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ కు ఆమె పూర్తిస్థాయిలో హాజరుకావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో తన పాత్రకు పరిమిత స్థాయిలోనే ప్రాధాన్యత ఉందనే భావనతోనే జాన్వీ కొంత దూరంగా ఉంటోందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు భారీ రెమ్యూనరేషన్ కారణంగానే ఈ ప్రాజెక్ట్‌ను ఆమె అంగీకరించిందన్న చర్చ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇక పెద్ది సినిమా జాన్వీ కెరీర్‌కు కీలక మలుపు కావచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ విజయం సాధిస్తే, తెలుగు సినీ పరిశ్రమలో ఆమెకు మరిన్ని పెద్ద అవకాశాలు రావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం బాలీవుడ్లో కూడా పరిమిత అవకాశాలే ఉన్న నేపథ్యంలో, ఈ సినిమా ప్రమోషన్లలో చురుకుగా పాల్గొనడం ఆమె ఇమేజ్‌కు ప్లస్ అవుతుందని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. నిర్మాత వెంకట సతీష్ కిలారు(Venkata Satish Kilaru) నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ కు దగ్గరపడుతున్న వేళ, జాన్వీ చివరికి ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి






