స్విస్ వీధుల్లో మెరిసిపోతున్న జాన్వీ
శ్రీదేవి(Sridevi) పెద్ద కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ భామ జాన్వీ కపూర్(Janhvi Kapoor). తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ ఇప్పటికీ పలు సినిమాల్లో నటించింది.


సినిమాలతో పాటూ తన ఫ్యాషన్ సెన్స్ కారణంగా ఎక్కువగా అందరి దృష్టినీ ఆకర్షించే జాన్వీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.


అందులో స్విట్జర్లాండ్ లోని అందమైన ప్రకృతి ఒడిలో సూర్యుని వేడి తగిలేలా మినీ ఫ్రాక్ ధరించి చాలా సింపుల్ గా ఉంటూనే ఎంతో అందంగా కనిపించింది. ఈ ఫోటోలకు ఆమె ఫాలోవర్లు లైకుల వర్షం కురిపిస్తూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.










