Janhvi Kapoor: పేస్టల్ బస్టియర్ ఫ్రాక్ లో మెరిసిపోతున్న జాన్వీ
అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్(Janhvi kapoor), తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా అమ్మడు చేసే గ్లామర్ షో కు ఎంతో మంది ఫ్యాన్స్ ఫిదా అవుతూ ఉంటారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాన్వీ ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్ ను నెట్టింట అప్లోడ్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లోనే ఉంటుంది. అందులో భాగంగానే జాన్వీ తాజా ఫోటోషూట్ అందరినీ తెగ ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోల్లో జాన్వీ పేస్టల్ కలర్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ సీక్విన్డ్ బస్టియర్ గౌను ను ధరించి, దానికి తగ్గట్టు సింపుల్ జ్యుయలరీని ధరించి ఎంతో అందంగా మెరిసిపోగా, నెటిజన్లు ఆమె ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తూ, వాటిని వైరల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.

















