మంగళగిరి భవిష్యత్తులో క్రికెట్ హబ్‌గా : సినీ నటుడు రామ్‌చరణ్
రాజధాని అమరావతిలో మంగళగిరి వేదికగా రూపుదిద్దుకున్న క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ ప్రమాణాలతో ఉందని సినీనటుడు రామ్‌చరణ్ (Ram Charan) అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (Andhra Cricket Association) ఆధ్వర్యంలో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) చివరిదశ మ్యాచ్‌లకు ఆయన హాజరై రెండో మ్యాచ్‌ను ప్రారంభించారు. అంతుకుముందు భీమవరం బుల్స్ క్యాపిటల్(Bhimavaram Bulls Capital) అమరావతి రాయల్స్ మ్యాచ్ (Amaravati Royals match)కు టాస్ వేశారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ( ఏసీఏ) స్టేడియం అద్భుతంగా ఉందని కొనియాడారు. ఇక్కడి వసతి సౌకర్యాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయన్నారు. మంగళగిరి ప్రాంతం భవిష్యత్తులో క్రికెట్ హబ్‌గా మారాలని ఆకాంక్షించారు. రామ్‌చరణ్ రాకతో మైదానానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్, కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, శాప్ చైర్మన్ రవినాయుడు పాల్గొన్నారు.








