కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. సీఎం రేవంత్‌కు పీఏగా పనిచేస్తున్నారా? : జగదీశ్ రెడ్డి
హైబ్రిడ్ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను తుంగలో తొక్కిందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. స్కీములు లేవు కానీ రోజుకో స్కాం వెలుగు చూస్తోందన్నారు. పీఎం కుసుమ్ పథకంలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ నేతలు తెరతీశారని ఆయన ఆరోపించారు. విద్యుత్ శాఖలో మరో స్కాంను త్వరలో బయట పెడతామన్నారు. వడ్ల కొనుగోళ్లు పూర్తయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గం. మిగిలిన వడ్లు మొత్తం కొనుగోలు చేయాలి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy,) సీఎం రేవంత్ (CM Revanth)కు పీఏగా పనిచేస్తున్నారా? మోదీ (Modi), చంద్రబాబు (Chandrababu), రేవంత్ రెడ్డి, జనసేన అన్నీ ఒకటే టీమ్. మ్యాచ్ ఫిక్సిండ్ డ్రామాలు తప్ప ఏమీలేదు అని విమర్శించారు.








