పవన్‌కల్యాణ్‌ను కలిసిన రామ్‌చరణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను సినీ నటుడు రామ్‌చరణ్ (Ram Charan) గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం (Jana Sena Party Central Office)లో మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలోని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (Andhra Cricket Association)కు చెందిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి రామ్‌చరణ్ వచ్చారు. ఈ సందర్భంగా జనసేన కార్యాలయాని వచ్చి దాదాపు 20 నిమిషాల పాటు ఇక్కడ ఉన్నారు. ఇద్దరు కార్యాలయం ప్రాంగణంలో తిరుగుతూ మాట్లాడుకున్నారు. పార్టీ కొత్త కార్యాలయ భవనాన్ని చూశారు.








