బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు బెయిల్
బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman)కు తెలంగాణ హైకోర్టు (High Court) బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరి పూచీకత్తులతో ఆయనకు బెయిల్ ఇచ్చింది. మే 26న తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడారు. అందులో నాంపల్లిలోని సింగరేణి భవన్ (Singareni Bhavan)తో పాటు మందమర్రి (Mandamarri)లోని జీఎం కార్యాలయ అధికారులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై సింగరేణి భవన్ అధికారులు నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆయన్ను తెలంగాణ భవన్లో అరెస్టు చేశారు. ఈ కేసులో బాల్క సుమర్కు తాజాగా బెయిల్ మంజూరైంది.








