కాంగ్రెస్, జనసేన కలిసి డ్రామాలు : జగదీశ్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రెస్‌మీట్ లో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) స్పందించారు. పవన్ వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయన్నారు. తెలివితక్కువ మాటలు మాట్లాడటం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ (Congress), జనసేన (Jana Sena) కలిసి నాటకాలాడుతున్నాయన్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. మోదీ రాసిచ్చారు పవన్‌కల్యాణ్ చదివారంటూ ఆరోపించారు.








