Jagadish Reddy: అసెంబ్లీ నుంచి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి (Jagadish Reddy) ని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ (Speaker) ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. స్పీకర్ పట్ల వ్యాఖ్యలు చేసిన జగదీశ్‌రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని మంత్రి సీతక్క (Seethakka) శాసనసభలో ప్రతిపాదించారు. శాసన వ్యవస్థను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) విజ్ఞప్తి చేశారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు విషయాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలని సూచించారు. బడ్జెట్ సెషన్స్ ముగిసే వరకు జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని సభావ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) ప్రతిపాదించగా, స్పీకర్ ఆమోదించారు. జగదీశ్‌రెడ్డి వెంటనే సభ నుంచి వెళ్లి పోవాలని స్పీకర్ ఆదేశించారు.