Trimukha: ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “త్రిముఖ” మూవీ
యోగేష్ కల్లె హీరోగా, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “త్రిముఖ” (Trimukha). అకృతి అగర్వాల్, CID ఆదిత్య శ్రీవాస్తవ, మొట్టా రాజేంద్రన్, ఆశు రెడ్డి, సాహితీ దాసరి, ప్రవీణ్, షకలక శంకర్, సుమన్, రవి ప్రకాష్, జీవా, సమ్మెట గాంధీ, జెమినీ సురేశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి రాజేష్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఐదు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రానున్న “త్రిముఖ” సినిమాని ఈ నెల 30న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ రోజు “త్రిముఖ” సినిమా డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా
నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ – స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాలు మనకు తక్కువగా వస్తుంటాయి. అలాంటి మంచి స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా “త్రిముఖ”. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. హీరో యోగేష్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నాడు. ఆయనకు యూఎస్ లో మంచి లైఫ్ ఉన్నా, సినిమా మీద ప్యాషన్ తో టాలీవుడ్ కు వచ్చాడు. ఇలాంటి మంచి చిత్రాన్ని మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు ప్రవీణ్ మాట్లాడుతూ – “త్రిముఖ” సినిమా ఈ నెల 30న మీ ముందుకు వస్తోంది. స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న చిత్రమిది. మేమంతా మంచి క్యారెక్టర్స్ చేశాం. హీరోతో పాటే ట్రావెల్ చేసే క్యారెక్టర్ నాది. నటుడిగా నాకు మంచి సంతృప్తినిచ్చిన చిత్రమిది. జెమినీ సురేష్ క్యారెక్టర్ కూడా సర్ ప్రైజింగ్ గా ఉంటుంది. యోగేష్ కు సినిమా మీద ప్యాషన్ ఎక్కువ. ఆయన ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేస్తున్న రాజేశ్ గారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. సాహితీ దాసరి కూడా మంచి పాత్రలో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.
నటి సాహితీ దాసరి మాట్లాడుతూ – థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చే చిత్రమిది. ఈ సినిమాలో నేనొక ఇంపార్టెంట్ రోల్. ఆ క్యారెక్టర్ ఏంటి అనేది ఇప్పుడు రివీల్ చేయలేము. మీరు మా మూవీ ట్రైలర్ చూస్తే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసినట్లు ఉండదు. రాజేశ్ గారు అంత బాగా తెరకెక్కించారు. అలాగే యోగేష్ ఎంతో అనుభవం ఉన్న హీరోలా పర్ ఫార్మ్ చేశారు. నెక్ట్స్ వీక్ రిలీజ్ కు వస్తున్న మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ రాజేశ్ నాయుడు మాట్లాడుతూ – ఒక మంచి కథతో, బలమైన స్క్రీన్ ప్లే తో “త్రిముఖ” చిత్రాన్ని రూపొందించాను. మూవీ ఫస్టాఫ్ అంతా ఎంటర్ టైన్ చేస్తుంది. సెకండాఫ్ తల పక్కకు తిప్పనంతగా ఎంగేజింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంటుంది. సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి పాత్ర ఒక మంచి విషయాన్ని తెలియజేస్తుంది. రొటీన్ సినిమాలకు తప్పకుండా భిన్నంగా ఉండేలా ప్రయత్నించాం. యోగేష్ కు నటుడిగా పేరు తెచ్చే మూవీ అవుతుంది. సన్నీ లియోన్ గారిని ఇప్పటిదాకా గ్లామర్ యాంగిల్ లోనే చూశారు. ఆమెలోనూ ఒక నటి ఉంటుంది. ఆమె నటిగా పర్ ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో సన్నీ లియోన్ గారిని తీసుకున్నాం. ప్రవీణ్, జెమినీ సురేష్ క్యారెక్టర్స్ ఆకట్టుకుంటాయి. ప్రవీణ్ ఎంతో సపోర్ట్ చేశారు. జెమినీ సురేష్ చిన్న క్యారెక్టరైనా ఇంపాక్ట్ తెచ్చేలా నటించారు. సాహితీ క్యారెక్టర్ సర్ ప్రైజ్ చేస్తుంది. ఈ నెల 30న రిలీజ్ కు వస్తున్న “త్రిముఖ” చిత్రాన్ని ఆదరించాలి రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.
హీరో యోగేష్ కల్లె మాట్లాడుతూ – “త్రిముఖ” హీరోగా నా ఫస్ట్ మూవీ. ఈ సినిమా రూపకల్పనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అడ్డంకులన్నీ దాటుకుని ఈ నెల 30న రిలీజ్ కు తీసుకొస్తున్నాం. ఈ క్రమంలో నాకు మా మూవీ ఆరిస్టులంతా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నాతో పాటు ప్రమోషనల్ టూర్స్ కు వచ్చారు. చిన్న సినిమా యాక్ట్ చేసి వెళ్లిపోయాం అనుకోకుండా ప్రెస్ మీట్స్ లో పాల్గొంటూ మాకు సహకరిస్తున్నారు. మా కాస్టింగ్ అందరికీ థ్యాంక్స్. సన్నీ లియోన్ గారు మా మూవీలో నటించడం విశేషం. ఆమెకు మా చిత్రంతో నటిగా మంచి పేరొస్తుంది. అలాగే సీఐడీ ఆదిత్య శ్రీవాస్తవ ఇప్పటిదాకా తెలుగులో నటించలేదు. ఆయనకు ఫస్ట్ తెలుగు మూవీ “త్రిముఖ”. కేవలం మా కంటెంట్ నచ్చి ఆయన ఒప్పుకున్నారు. కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న కథతో ఒక కొత్త ప్రయత్నం చేశాం. మంచి కథా కథనాలతో సినిమాను రూపొందించారు మా డైరెక్టర్ రాజేశ్. మా సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే థియేట్రికల్ రిలీజ్ లోనూ మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.






