Chandrababu: సిఎం ఫిట్నెస్ కు షాక్ అవుతున్న క్యాడర్
ఈ రోజుల్లో సాధారణంగా 60 ఏళ్ళు దాటితే రెస్ట్ తీసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్యంగా ఉంటే మరో పదేళ్ళు ఎక్కువ.. కానీ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు మాత్రం.. 75 ఏళ్ళ వయసు దాటినా సరే చూపిస్తున్న స్పీడ్ మాత్రం క్యాడర్ ను ఆశ్చర్యపరుస్తోంది. అటు సామాన్య ప్రజల్లో కూడా సిఎం చంద్రబాబు నాయుడు ఫిట్నెస్ హాట్ టాపిక్ అవుతోంది. ఫిట్నెస్, హెల్త్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సిఎం.. ఇప్పుడు తన పదవిలో విరామం లేకుండా గడుపుతున్నారనే మాట వాస్తవం.
ఇటీవల దావోస్(Davos) పర్యటనకు వెళ్ళిన సిఎం.. అక్కడ నాలుగు రోజుల పాటు గడిపారు. ఆ తర్వాత, హైదరాబాద్ నుంచి నేరుగా సచివాలయానికి చేరుకొని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి(SLBC) హాజరు అయ్యారు. అక్కడ బ్యాంకర్లతో సమావేశం కావడమే కాకుండా.. సుదీర్ఘంగా సిఎం ప్రసంగించారు. ఇక నేడు నగిరి వెళ్ళారు చంద్రబాబు. అక్కడ కూడా సుదీర్ఘ ప్రసంగమే చేసారు. వచ్చిన దగ్గరి నుంచి ఏదోక సమావేశంతో బిజీగానే గడుపుతూ వస్తున్నారు చంద్రబాబు. దావోస్ నుంచి నగిరి వరకు మీడియాలోనే కనిపించారు చంద్రబాబు.
నగిరిలో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిన్న సాయంత్రం సుదీర్ఘంగా గోదావరి పుష్కరాలపై సమీక్ష నిర్వహించారు. పుష్కారాల విషయంలో ఏం చేయాలో అధికారులకు, మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పదవిలో ఉంటే విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వరు చంద్రబాబు అంటూ ఉంటారు. అందుకు న్యాయం చేస్తూ.. బిజీగా గడుపుతున్నారు. ఈ నెల 26 వరకు వరుస కార్యక్రమాలతో బిజీగా ఉండనున్నారు సిఎం. దీనితో సిఎం చంద్రబాబు ఫిట్నెస్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.






