Abhishek Sharma: సూర్య భాయ్ వారసుడు శర్మ గారే..?
సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) తర్వాత.. భారత టి20 జట్టును నడిపించేది ఎవరు..? ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులో మదిలో ఎక్కువగా మెదులుతున్న ప్రశ్న ఇది. రోహిత్ శర్మ తర్వాత.. భారత టి20 జట్టును సూర్యకుమార్ యాదవ్ నడిపిస్తున్నాడు. అతని సారధ్యంలో భారత్ మంచి విజయాలే సాధించింది. అయితే.. టి20 వరల్డ్ కప్ తర్వాత అతను క్రికెట్ నుంచి తప్పుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే వన్డేలు, టెస్ట్ లకు అతనిని జట్టు యాజమాన్యం పక్కన పెట్టింది. టి20 లు మాత్రమే ఆడుతున్నాడు.
అయితే అతని స్థానంలో హార్దిక్ పాండ్యా(Hardik pandya) లేదా బూమ్రాను కెప్టెన్ గా నియమించాలి అని బోర్డు భావిస్తున్నా.. ఆ ఇద్దరికీ ఫిట్నెస్ సమస్యలు ఉండటంతో వెనకడుగు వేస్తోంది. ఇక అక్షర్ పటేల్ పేరు కూడా వినపడుతూ వస్తోంది. కానీ అతను మూడు ఫార్మాట్ లు ఆడాల్సి ఉండటంతో వద్దనే భావనలో బోర్డు ఉంది. ఇక ఇప్పుడు వస్తున్న కథనాల ప్రకారం.. యువ ఆటగాడు అభిషేక్ శర్మకు కెప్టెన్ గా అవకాశం ఇవ్వాలని బోర్డు పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. 2024 నుంచి అతను జట్టులో నిలకడగా రాణిస్తున్నాడు.
దూకుడుతో పాటు నిలకడ కూడా అతని సొంతం. ఇతర ఆటగాళ్ళతో కూడా అతనికి మంచి సంబంధాలే ఉన్నాయి. దీనితో అతనికి కెప్టెన్ గా అవకాశం ఇస్తే భవిష్యత్తుకు డోకా ఉండదు అనే భావంలో జట్టు యాజమాన్యం కూడా కనపడుతోంది. అతనిని షైన్ చేస్తే బ్యాటింగ్ ఆల్ రౌండర్ గా రాణించే సత్తా ఉంటుంది. గిల్ ను కెప్టెన్ గా నియమించాలి అని భావించినా.. అతనిలో నిలకడ లేకపోవడం, అగ్ర జట్ల మీద ఆడకపోవడంతో పక్కన పెట్టారు. కాని అభిషేక్ అన్ని జట్ల మీద నిలకడగా రాణించడంతో కెప్టెన్ గా ప్రమోట్ చేయాలని భావిస్తోంది బోర్డు.






