Bhatti Vikramarka: సింగరేణిపై కట్టుకథలు ప్రచారం : డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణకు ఆత్మగా ఉన్న సింగరేణి (Singareni)పై కొన్ని కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆరోపించారు. ప్రజాభవన్‌లో భట్టి మీడియాతో మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. సైట్ విజిట్ అనే నిబంధనను కోల్ ఇండియా (Coal India) 2018లో పెట్టిందని చెప్పారు. దీని ప్రకారమే సింగరేణి 2021లో సైట్ విజిట్‌ను తప్పనిసరి చేసిందన్నారు. 2018, 2019లో తాము అధికారంలో ఉన్నామా? అని ప్రశ్నించారు. సింగరేణి అనేది స్వయంప్రతిపత్తి సంస్థ అని, సంస్థలో ప్రతి నిర్ణయం మంత్రిమండలి వద్దకు రాదని చెప్పారు. సైట్ విజిట్ అనే నిబంధన దేశంలో ఎక్కడా లేదన్నట్లు దుష్ప్రచారం చేశారు. టెండర్లు రద్దు చేయకపోతే ప్రజల్లో అపోహలు పెరుగుతాయని వెంటనే రద్దుకు ఆదేశించాను. నైనీ కోల్బ్లాక్లకు బిఆర్ఎస్ (BRS) హయాంలోనే టెండర్లు పిలిచారు. సింగరేణిలో మొత్తం 25 కాంట్రాక్టులు జరిగితే, 20 టెండర్లు బీఆరఎస్ హయాంలోనే జరిగాయి అని తెలిపారు.






