Aria University: రచయితలుగా రాణించాలనుకునే వారికి సువర్ణావకాశం.. ఆరియా యూనివర్సిటీలో తెలుగు సృజనాత్మక రచన కోర్సులు ప్రారంభం!
తెలుగు భాషా సాహిత్యంపై మమకారం ఉన్న వారికోసం, పద్యాలు, కథలు, నవలలు రాయాలనే అభిలాష ఉన్నవారి కోసం అమెరికాలోని ఆరియా యూనివర్సిటీ (Aria University, Milpitas, CA, USA) వినూత్నమైన కోర్సులను రూపొందించింది. ‘సృజనాత్మక రచన’ (Creative Writing) విభాగంలో భాగంగా రెండు ఎన్రిచ్మెంట్ కోర్సులను ఆన్లైన్ మాధ్యమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి అందుబాటులోకి తెచ్చింది.
ఈ శిక్షణా కార్యక్రమం 15 వారాల పాటు కొనసాగుతుంది. ప్రతి వారం గంటన్నర సేపు తరగతులు జరుగుతాయి.
1. పద్యం – గేయం కోర్సు: ఈ కోర్సును ప్రముఖ వ్యాకరణ వేత్త, వందలాది పద్యాలకు వ్యాఖ్యాత అయిన ప్రొఫెసర్ డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ బోధిస్తారు.
పద్య నిర్మాణం, శిల్పం, ఛందస్సు, వ్యాకరణబద్ధంగా భాషను ప్రయోగించడం వంటి అంశాలపై శిక్షణ ఉంటుంది.
యతిప్రాసల్లోని వైవిధ్యం, గేయ నిర్మాణంలోని మెలకువలు నేర్చుకోవచ్చు.
కోర్సు ముగిసే నాటికి విద్యార్థులు అవధానం చేయడానికి సిద్ధమయ్యేలా మెరుగులు దిద్దుతారు.
వివరాలకు: https://aria.edu/creativewriting-poetry/
2. కథ – నవల కోర్సు: ఈ కోర్సును ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగ సంచాలకులు డాక్టర్ సి. మృణాళిని గారు బోధిస్తారు.
కథా వస్తువు ఎంపిక, సన్నివేశాల కూర్పు, సంఘర్షణ, ఆసక్తికరమైన కథనం ఎలా ఉండాలో నేర్పిస్తారు.
సామాజిక స్పృహతో సమస్యలను కథల్లో ప్రతిబింబించడం, పాఠకులను కట్టిపడేసే ముగింపు వంటి మౌలిక సూత్రాలపై అవగాహన కల్పిస్తారు.
వివరాలకు: https://aria.edu/creativewriting-novel/
రిజిస్ట్రేషన్ సమాచారం
ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నవారైనా ఈ కోర్సుల్లో చేరవచ్చు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఎండోమెంట్ ఫండ్ సహకారంతో ఈ కోర్సులు నిర్వహిస్తున్నారు.
నమోదుకు ఆఖరి తేదీ: జనవరి 23, 2026
దరఖాస్తు లింక్: https://aria.edu/enrichment-courses/
సంప్రదించాల్సిన ఫోన్: 1 844 872 8680
ఈమెయిల్: admissions@aria.edu
సాహిత్య రంగంలో తమ ముద్ర వేయాలనుకునే ఔత్సాహిక రచయితలకు ఇదొక అరుదైన అవకాశం. నైపుణ్యం కలిగిన గురువుల సమక్షంలో నేర్చుకోవడం వల్ల మీ రచనలకు మరింత వన్నె చేకూరుతుంది.






