Rohith Sharma: జట్టు సెలెక్షన్ పై రోహిత్ సంచలన కామెంట్స్
ఈ మధ్యకాలంలో భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కు సంబంధించి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి తెలిసింది. కొంతమంది కీలక ఆటగాళ్లను పక్కన పెట్టడంపై, మాజీ ఆటగాళ్లు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. గతంలో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన వాళ్లకు, ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శలు కూడా వస్తున్నాయి. కనీసం ఆటగాడిని ఎందుకు తప్పించారు, అనే దానికి సంబంధించి స్పష్టమైన కారణం కూడా సెలెక్టర్లు చెప్పలేని పరిస్థితి ఉంది. మహమ్మద్ షమీ సహా పలువురు ఆటగాళ్ళ విషయంలో భారత జట్టు యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నారు.
ఈ నేపద్యంలో తాజాగా భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ ఈవెంట్ లో మాట్లాడిన రోహిత్ శర్మ, జట్టు నుంచి ఒక ఆటగాడిని పక్కన పెడితే.. ఎందుకు పక్కన పెట్టామో చెప్పాలన్నాడు. జట్టు ఎంపిక చేసే ప్రక్రియ అత్యంత క్లిష్టంగా ఉంటుందని, ఈ క్రమంలో కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అన్నాడు. ముఖ్యంగా కెప్టెన్ కు ఇది అత్యంత క్లిష్టమైన అంశంగా చెప్పినా.. రోహిత్ శర్మ జట్టు ఎంపిక అనేది అందరినీ సంతృప్తి పరచలేమన్నాడు.
అయితే ఎందుకు పక్కన పెట్టామో మాత్రం, ఆటగాడికి వివరంగా చెప్పడం అనేది అత్యంత కీలకమని, గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. 2022 ఆసియా కప్ టి20 వరల్డ్ కప్ టోర్నీలో శ్రేయస్ అయ్యర్(Shreyas iyer) ను కాదని బౌలింగ్ చేయగలిగే, దీపక్ హుడాను జట్టులోకి తీసుకున్నామని తెలిపాడు. టీం బాలన్స్ గా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. తాను హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్(Rahul Dravid) స్వయంగా అయ్యర్ కు వివరించినట్లు గుర్తు చేసుకున్నాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో మహమ్మద్ సిరాజ్ (Mohmmad Siraj) కు కూడా ఇదేవిధంగా వివరించి చెప్పామని తెలిపాడు. 2023 వండే వరల్డ్ కప్ టోర్నమెంట్లో స్పిన్నర్ చాహల్ ను తీసుకోలేదు అన్నాడు. అయినప్పటికీ కూడా అతనికి వివరించే ప్రయత్నం చేశామని తెలిపాడు. వచ్చే టి20 వరల్డ్ కప్ లో టీమిండియా సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు హిట్ మాన్.






