Bangladesh: బంగ్లా క్రికెట్ బోర్డుకు ఎంత లాస్ అంటే..!
భారత్ – బంగ్లాదేశ్ దేశాల మధ్య నెలకొన్న పరిణామాల ప్రభావంతో.. వచ్చే నెలలో జరగబోయే టి20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ జట్టు తప్పుకుంది. ఐపిఎల్ (IPL) నుంచి బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు ముస్తాఫిజుర్ రహమాన్ ను తప్పించిన తర్వాత బంగ్లా క్రికెట్ బోర్డు భారత్ విషయంలో సీరియస్ గానే ముందుకు వెళ్తోంది. ఈ తరుణంలో భారత్ లో మ్యాచ్ లు ఆడేది లేదని బంగ్లాదేశ్ బోర్డు స్పష్టం చేసింది. దీనితో బంగ్లా క్రికెట్ బోర్డు భారీగా నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంది ఆ బోర్డు.
ఇక ఈ నిర్ణయంతో వాళ్ళు ఎంత నష్టపోయే అవకాశం ఉంది.. ఏంటీ అనేది ఒకసారి చూస్తే, టోర్నమెంట్‌కు దూరంగా ఉండటం వల్ల బంగ్లాదేశ్ ఆటగాళ్లు మ్యాచ్ ఫీజులు, బోనస్ లు, ప్రైజ్ మనీని కోల్పోతారు. సాధారణ మ్యాచ్ ల కంటే వరల్డ్ కప్ మ్యాచ్ లలో.. ఫీజులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఐసీసీ ఇచ్చే పార్టిసిపేషన్ ఫీజును కూడా బంగ్లా బోర్డు కోల్పోతుంది. దాదాపు 5 లక్షల డాలర్లు ఐసిసి(ICC) నుంచి అందుతాయి. ప్రసార ఆదాయం, వాణిజ్య ప్రకటనల ప్రభావం ఆటగాళ్ల సంపాదనపై కూడా ప్రభావం పడనుంది.
ప్రసారకులు, స్పాన్సర్లు.. ముఖ్యంగా భారత ఉపఖండంలో – వీక్షకులను కోల్పోయే ప్రమాదం ఉంది. రెండు దేశాల టైం రెండు ఒకటే కాబట్టి.. భారీగా మ్యాచ్ లు చూస్తూ ఉంటారు అభిమానులు. కాబట్టి ఈ విషయంలో బంగ్లాదేశ్ భారీగా నష్టపోయే అవకాశం ఉంది. బోర్డు సొంత ఆర్థిక విషయాల విషయానికొస్తే, ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్‌తో సహా బోర్డు అధికారులు, బోర్డు ఆదాయంలో ఎక్కువ భాగం 2027 వరకు ఐసిసి ఒప్పందాలతో చేసుకున్నవి రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. భవిష్యత్ ద్వైపాక్షిక సిరీస్‌లపై కూడా దీని ప్రభావం భారీగానే ఉండే అవకాశం ఉంది.






