Pooja Hegde: మినీ డ్రెస్ లో పూజా స్టన్నింగ్ పోజులు
ఒక లైలా కోసం(Oka Laila Kosam) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజా హెగ్డే(Pooja Hede) మొదటి సినిమాతోనే బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ముకుంద(Mukunda) మూవీలో నటించి మంచి హిట్ ను అకౌంట్ లో వేసుకున్న పూజా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం కోలీవుడ్ లో సినిమాలు చేస్తున్న పూజాకు తెలుగులో చెప్పుకోదగ్గ ఆఫర్లు లేవు. అయినప్పటికీ అమ్మడు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంది. తాజాగా బుట్టబొమ్మ పూజా మినీ డ్రెస్ లో చాలా స్టైలిష్ లుక్ లో అందరినీ స్టన్ చేయగా, ఈ ఫోటోలో అమ్మడి అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.






