Sonic Weapon: వెనెెజువెలాపై సీక్రెట్ సోనిక్ వెపన్ ప్రయోగం… ట్రంప్ క్లారిటీ..!
వెనెజువెలాపై మెరుపుదాడి చేసి ఆదేశ అధ్యక్షుడు మదురో దంపతులను తీసుకెళ్లింది అమెరికా. ఇంత దాడి జరిగి సాక్షాత్తూ అధ్యక్షుడినే ఎత్తుకెళ్లినా ఎందుకు వెనెజువెలా బలగాలు స్పందించలేదన్న అనుమానం అందరినీ వెంటాడింది. అంతేకాదు.. మరికొందరైతే వెనెజువెలాలో మదురో దంపతులు చుట్టూ ఉన్న రక్షణ సిబ్బంది.. అమెరికాతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి దావోస్ వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్లారిటీ ఇచ్చారు.
వెనెజువెలాపై దాడిలో సోనిక్ వెపన్ (Secret Sonic Weapon)ను వినియోగించినట్లు ధ్రువీకరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.‘‘మన దగ్గర ఎవరికీ తెలియని ఆయుధాలు ఉన్నాయి. వాటి గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిదని భావిస్తున్నాను. అదొక అద్భుతమైన దాడి’’ అని ట్రంప్ (Donald Trump) ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. మదురోను కస్టడీలోకి తీసుకునేందుకు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ (Operation Absolute Resolve)లో యూఎస్ అత్యంత శక్తిమంతమైన ఆయుధాన్ని వాడిందని ఇటీవల ఆ మాజీ అధ్యక్షుడికి అత్యంత సన్నిహితంగా పనిచేసిన గార్డ్ చెప్పారు.
మా ముక్కుల నుంచి రక్తం కారడం మొదలైంది. కొందరు వాంతులు చేసుకున్నారు. ఇంకొందరు నేలపై పడిపోయారు. ఆ సోనిక్ ఆయుధం ముందు మేం నిల్చోలేకపోయాం. అగ్రరాజ్యం (USA)తో పోరాడగలమని ఎవరైనా అనుకుంటే అది భ్రమే అవుతుంది’’ అని ఆందోళన వ్యక్తంచేశాడు. ఓ మీడియా సంస్థ ప్రచురించిన ఈ వ్యాఖ్యలను వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దాంతో ఈ ఆయుధం వార్తలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.






