Minister Gottipati: ఐదేళ్లలో ఏం చేశారని ఆయనకు క్రెడిట్ ఇవ్వాలి : మంత్రి గొట్టిపాటి
క్యారెక్టర్ లేని మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) క్రెడిట్ గురించి మాట్లాడటం విడ్డూరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar) విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏం చేశారని ఆయనకు క్రెడిట్ (Credit) ఇవ్వాలని మండిపడ్డారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారు. విద్యుత్‌శాఖను జగన్ సర్వనాశనం చేశారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు (Electricity charges) పెంచి రూ.30 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేశారు. పీపీఏలు రద్దు చేశారు. వీటన్నింటి క్రెడిట్ కచ్చితంగా జగన్‌కు ఇవ్వాలి. మళ్లీ ఏం మొహం పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నారు. వైసీపీ అధికారంలో ఉండుంటే రాష్ట్రం అప్పులకుప్పగా మారడంతో పాటు విద్యుత్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యేది. రాష్ట్రాన్ని చోరి చేసిన జగన్ క్రెడిట్ చోరి గురించి మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు అని అన్నారు.






