Parthasarathy: మరోసారి పాదయాత్ర చేస్తే.. రాష్ట్రం ఏమైపోతుందో? : మంత్రి పార్థసారథి
వైసీపీ అధినేత జగన్ (Jagan) మరోసారి పాదయాత్ర చేస్తే రాష్ట్రానికి అంచనా వేయలేనంత నష్ట జరిగిందని రాష్ట్ర గహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి (Parthasarathy) అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మరోసారి పాదయాత్ర చేస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుందో? ప్రజలను ఓసారి మోసం చేయగలరు. ఆయన మళ్లీ మళ్లీ మోసం చేయాలనుకుంటే ప్రజలు అంత అమాయకులు కాదు అని అన్నారు. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో ఇద్దరు దళితుల మధ్య వ్యక్తిగత కక్షలతో జరిగిన ఘర్షణలో సాల్మన్ (Salman) అనే వైసీపీ కార్యకర్త మరణిస్తే దీనిపై జగన్ నీచరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ రంగు పులిమి, కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు చూస్తున్నారని విమర్శించారు. దళితులు మావాళ్లని జగన్ అంటున్నారని, దళిత యువకుణ్ని హత్యచేసి డోర్ డెలివరీ చేసిన చరిత్ర మీ పార్టీదని ధ్వజమెత్తారు. ఆ కేసులో నిందితుడిని అందలం ఎక్కించడం, అతను జైలు (Jail) నుంచి బయటకొస్తే ఊరేగింపుగా తీసుకెళ్లడాన్ని ప్రజలు మరిచిపోరన్నారు. మాస్క్లు, గ్లౌజులు అడిగిన దళిత డాక్టర్ను ఎంతలా క్షోభకు గురిచేశారో గుర్తుచేసుకోవాలన్నారు. అధికారం కోల్పోతేనే దళితులు తమ వాళ్లని జగన్కు గుర్తొస్తుందని విమర్శించారు.






