Amaravati: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతి బిల్లు
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి (Amaravati)కి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ ప్రస్తుత పార్లమెంటు (Parliament) సమావేశాల్లోనే పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సంబంధిత బిల్లు పార్లమెంటు బడ్జెట్ (Budget) సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ీVAం మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తోంది. ముసాయిదా క్యాబినెట్ నోట్‌ను కేంద్ర గహ నిర్మాణ పట్టణాభివద్ధి, న్యాయ వ్యయ శాఖలతో పాటు, నీతి ఆయోగ్‌లకు పంపి, అభిప్రాయం కోరింది. న్యాయ శాఖ ఇప్పటికే అభిప్రాయం తెలియజేసిందని సమాచారం. ముసాయిదా నోట్‌పై త్వరగా అభిప్రాయం తెలియజేయాలని మిగతా శాఖలకూ ీVAం మంత్రిత్వశాఖ సూచించినట్లు తెలిసింది. కేంద్రమంత్రి వర్గం ఆమోదం తర్వాత, న్యాయశాఖ బిల్లు సిద్ధం చేస్తుంది. మళ్లీ దాన్ని క్యాబినెట్ (Cabinet) ఆమోదించాక, పార్లమెంటులో ప్రవేశపెడతారు.






