Sri Chidambharam: ఎం.ఎమ్.కీరవాణి ఆలపించిన ‘శ్రీ చిదంబరం’ చిత్రంలోని వెళ్లేదారిలో.. పాట విడుదల
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వినయ్ రత్నం తెరకెక్కించిన చిత్రం ‘శ్రీ చిదంబరం’. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ‘శ్రీ చిదంబరం’ చిత్రం నుంచి ఇటీవల టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌కు వచ్చిన అనూహ్య స్పందన గురించి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి గారు ఆలపించిన ‘వెళ్లేదారిలో’ అనే ఓ పాట బ్యూటిఫుల్ పాటను విడుదల చేశారు. సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి అభినందనలతో.. ఆయన సినిమాకు బెస్ట్ విషెస్ చెబుతూ పాటను విడుదల చేశారు. చందు రవి సంగీతం అందించిన ఈ పాటకు చంద్రశేఖర్ సాహిత్యాన్ని సమాకూర్చారు. ఈ పాట ట్యూన్‌తో పాటు లిరిక్స్ అందరి హృదయాలను హత్తుకుంటున్నాయి. ముఖ్యంగా కీరవాణి గారి గాత్రం ఈ పాటకు ప్రాణం పోసింది.
ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ” కీరవాణి గారు ఈ పాటలను ఆలపించడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన గాత్రంతో ఆ పాట ఎంతో గొప్పగా మారింది. సినిమా విషయానికొస్తే
ఇదొక ఓ అందమైన ప్రేమ కథా, వింటేజ్ విలేజ్ డ్రామాలో పూర్తి కొత్తదనం నిండి ఉంటుంది. ప్రతి పాత్ర, ప్రతి విజువల్ ఎంతో సహజంగా ఉంటుంది.ఇక ఇందులో హీరోకి ఉన్న అసలు పేరు కాకుండా.. ఊరంతా కూడా చిదంబరం అని ఎందుకు పిలుస్తుంటారు.. మరి అలా ఎందుకు పిలుస్తారు? అసలు హీరో ఎప్పుడూ కూడా కళ్లద్దాలు ఎందుకు పెట్టుకుని ఉంటాడు? అలా చేయడానికి గల కారణం ఏంటి? అనే ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం ఈ సినిమా. కొత్తదనంతో నిండిన సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా మా చిత్రం నచ్చుతుంది’ అన్నారు.






