DQ: దుల్కర్ వద్దనుకుని మంచి పని చేశాడు
ఏ స్టార్ అయినా సరే స్టార్డమ్ కోసమే పాకులాడతారు. కానీ మంచి స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటే ఆ సినిమాలే స్టార్లకు స్టార్డమ్ ను తెచ్చిపెడుతుందనేది చాలా తక్కువ మంది మాత్రమే నమ్ముతారు. అలాంటి వారిలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salman) ఒకడు. రీసెంట్ గా ఆయన సెలెక్ట్ చేసుకుంటున్న సినిమాలు, ఆయన రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ చూసుకుంటే ఈ విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది.
దుల్కర్ ఇటీవల వదులుకున్న కొన్ని భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవడంతో అతని స్క్రిప్ట్ సెలెక్షన్ ను అందరూ అభినందిస్తున్నారు. శంకర్(shankar) దర్శకత్వంలో తెరకెక్కిన ఇండియన్2(Indian2)లో సిద్ధార్థ్(Siddharth) పాత్ర, థగ్ లైఫ్ మూవీలో శింబు(Simbhu) క్యారెక్టర్, ఇక ఇటీవల రిలీజైన పరాశక్తి(parasakthi) సినిమాలు దుల్కర్ చేయాల్సినవి. కానీ ఆ సినిమాలను దుల్కర్ రిజెక్ట్ చేశాడు.
ఆ సినిమాలను రిజెక్ట్ చేసినప్పుడు దుల్కర్ ను అందరూ విమర్శించారు కానీ అవి రిలీజై వాటి రిజల్ట్ చూశాక మాత్రం అందరూ అతన్ని అభినందిస్తున్నారు. మిగిలిన హీరోలు కూడా స్టోరీ సెలెక్షన్ విషయంలో దుల్కర్ లాగా ఉంటే మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశముంది. కాగా దుల్కర్ ప్రస్తుతం పవన్ సాదినేని(pavan sadhineni) దర్శకత్వంలో ఆకాశంలో ఒక తార(Aakasam lo oka thara) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.






