Zee Telugu: జీ తెలుగు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1’ఈ శనివారం సాయంత్రం 6 గంటలకు!
తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించడంలో ఎప్పుడూ ముందుండే జీ తెలుగు ఈ వారం మరో కొత్త సినిమాతో వచ్చేస్తోంది. థియేటర్, ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న సెన్సేషనల్ మూవీ కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1.కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా అందిస్తోంది జీ తెలుగు. రిషబ్ శెట్టి,రుక్మిణీ వసంత్ నటించిన బ్లాకబస్టర్ మూవీ కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1,ఈ శనివారం (జనవరి 24) సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో మాత్రమే!
కాంతార ప్రాంతం చుట్టూ రాజశేఖర్ అనే రాజు రాజ్యం ఉంటుంది. రాజశేఖర్ వంశం ఏలే కాలంలో ఆ అడవి మొత్తం వాళ్ల ఆధీనంలోనే ఉంటుంది. అదే ప్రాంతంలో బర్మ (రిషబ్ శెట్టి) ఉంటాడు. తన ప్రజల కోసం బర్మ ఏకంగా రాజ్యంలోకే వెళ్లి వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య బర్మ, కనకావతి (రుక్మిణి వసంత్)కి దగ్గర అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది ?, అసలు బర్మ ఎవరు ?, అతను ఎక్కడ నుంచి వచ్చాడు ?కనకవతి ఎవరు? అనేప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ శనివారం జీ తెలుగులో ప్రసారమయ్యే కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1 సినిమా చూడాల్సిందే!
ఈ సినిమాలో పాన్ఇండియా స్టార్ రిషబ్ శెట్టి, రుక్మిణీ వసంత్ప్రధాన పాత్రలు పోషించగా, జయరామ్, రాకేష్ పూజారి వంటి ప్రముఖులు ఇతర ముఖ్యపాత్రల్లో మెప్పించారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాకి బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ఆకట్టుకునే కథ, కథనం, భావోద్వేగాలుకలగలసినయాక్షన్ఎంటర్టైనర్ కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1 సినిమాని మీరూ మిస్ కాకండి!
సంస్కృతి, సంప్రదాయాలే ప్రధానంగా సాగే ‘కాంతార: ఎలెజెండ్చాప్టర్1’.. ఈ శనివారం సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో!






