Davos: దావోస్ లో మూడో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన
పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంభాషించిన వివిధ జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు.
టైమ్ మీడియా ప్రతినిధి టిమ్ హోవాట్, బ్లూమ్హబెర్గ్ ప్రతినిధి జీనెత్ రోడ్రిగ్స్, బిజినెస్ టుడే ప్రతినిధి ఆలోక్ నాయర్, ఎన్డీటీవీ నుంచి ఆయుష్ ఐలావాదిలతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సీఎం
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి విషయంలో జరుగుతున్న పరిణామాలను, ప్రభుత్వ పాలసీలను మీడియా ప్రతినిధులకు వివరించిన ముఖ్యమంత్రి
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…
• ప్రపంచ ఆర్థిక సదస్సు ద్వారా పెట్టుబడులు ఆకర్షించటంతో పాటు వివిధ రంగాల్లో నూతన పరిణామాలను గమనించడానికి ఈ సదస్సు అద్భుతమైన వేదిక.
• గతంలో ఉమ్మడి ఏపీని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ను బ్రాండింగ్ చేసేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరంను నేను ఉపయోగించుకున్నాను.
• రాష్ట్రానికి బ్రాండింగ్ వస్తే పెట్టుబడులు వస్తాయి… పెట్టుబడులు వస్తే అభివృద్ధి జరుగుతుంది… అభివృద్ధి జరిగితే పేదలకు సంక్షేమం అందించవచ్చు.
•నాడు సింగపూర్ మాజీ అధ్యక్షుడు లీక్వాన్యూ, మలేషియా మాజీ అధ్యక్షుడు మహతీర్ నాకు స్పూర్తి.
• నేను ఆశావాదిని… భారీ లక్ష్యాలు నిర్దేశించుకోవడం… వాటి కోసం నిరంతరం పనిచేయడం నాకు అలవాటు.
• ముందుచూపుతో వ్యవహరించి… వినూత్నంగా ఆలోచించి… చిత్తశుద్దితో, కష్టపడి పని చేస్తే ఏదైనా సాధ్యం అని నమ్ముతాను.
• యువతకు నేను ఇదే విషయాన్ని చెబుతూ ఉంటాను… ఆ దిశగా ప్రొత్సహిస్తూ ఉంటాను.
• పరిశ్రమల ఫ్రెండ్లీ గవర్నమెంట్ మాది… ఈజ్ ఆఫ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా త్వరితగతిన అనుమతులిస్తున్నాం.
• పరిశ్రమలకు ఎస్క్రో ఖాతా ద్వారా ప్రోత్సాహకాలిచ్చే విధానాన్ని అమలు చేస్తున్నాం.
• అనుమతుల నుంచి పరిశ్రమల స్థాపన వరకు ప్రతి అంశాన్ని రియల్ టైంలో మానిటర్ చేస్తున్నాం.
• పరిశ్రమలకు వేగంగా అనుమతులివ్వడంతోపాటు… ఉత్పత్తి వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం.
• విశాఖకు గూగుల్ కంపెనీ రాక ఏపీ అభివృద్ధిలో గొప్ప ముందడుగు.
• ఏపీ ఐటీ మంత్రి లోకేష్ ఈ విషయంలో చూపిన చొరవ, ఫాలో అప్ వల్లే ఆ పెట్టుబడి సాధించాం.
• మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గూగుల్ పెట్టుబడిపై లోకేష్ సంప్రదింపులు జరిపారు.
• వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగంతో పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి.
• రాష్ట్రంలో అగ్రిటెక్ విధానాన్ని అమలు చేస్తున్నాం.
• గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ ఆమోనియా గురించి అంతా చర్చిస్తున్న సమయంలోనే ఏపీలో ఉత్పత్తికి అడుగులు వేసి.. పరిశ్రమ నిర్మిస్తున్నాం.
• విదేశాలకు గ్రీన్ అమోనియా ఉత్పత్తి ఎగుమతి చేసేందుకు ఇప్పటికే ఒప్పందాలు జరిగాయి.
• టెక్నాలజీ, టెలికాం, విద్యుత్, ఏవియేషన్, నేషనల్ హైవేస్ రంగాల్లో వచ్చిన సంస్కరణలతో దేశ దశదిశ మారిపోయింది.
• 30 ఏళ్ల క్రితం దేశ అభివృద్దిలో కీలక అడుగులు పడ్డాయి. నేడు ప్రతి రంగంలో దేశం అద్భుత పురోగతి సాధిస్తోంది.
• అప్పుడు… ఇప్పుడు సంస్కరణలను అందిపుచ్చుకుంటున్నాం.
• ఆ సంస్కరణలే మా రాష్ట్రంలోని యువతకు అవకాశాలు కల్పించాయి.
• రాజధాని నిర్మాణం ఒక అవకాశం. ఒక అద్భుతమైన ప్రణాళికతో రాజధాని నిర్మాణం జరుగుతోంది.
• అమరావతి భవిష్యత్ నగరంగా ఉంటుంది.
• టెక్నాలజీ, గ్రీన్-బ్లూ సిటీగా అమరావతి నిర్మిస్తున్నాం.
• టూరిజం అభివృద్దికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. మా రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.
• ఏపీలో గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్ ఏర్పాటు చేయాలనేది నా ఆలోచన.
• ఏపీ అమలు చేస్తున్న విధానాలను, చేస్తున్న ఆఆలోచనలను, వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది.
• జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక రంగం ఏపీ గురించి చర్చించుంటోంది.
• చైనా, జపాన్ సహా అనేక దేశాల్లో ఉన్న ఏజింగ్ సమస్య భారత దేశానికి లేదు.
• సమర్థ మానవ వనరులు, టెక్నాలజీ భారతదేశ అదనపు బలం.
• ఒకప్పుడు భారత్ ఎలక్టానిక్స్ వస్తువులను దిగుమతి చేసుకునేది. అలాంటి పరిస్థితి నుంచి ఆ రంగంలో ఎగుమతులు చేసే స్థాయికి చేరుకుంది.
• గతంలో డబుల్ డిజిట్ గ్రోత్ అంటే నమ్మలేదు… ఇప్పుడు అదే నిజమైంది.






