Pakistan: మారని పాక్ బుద్ధి, రిపబ్లిక్ డే టార్గెట్ గా భారీ కుట్ర..!
భారత భద్రతా బలగాలు ఎన్ని విధాలుగా బుద్ధి చెప్తున్నా సరే పాక్ బుద్ధి మాత్రం మారడం లేదు. ఉగ్రవాదులను భారత్ లక్ష్యంగా తయారు చేస్తూనే ఉంది. ఇటీవల ఢిల్లీ(Delhi) బాంబు పేలుళ్ళకు సంబంధించి పాకిస్తాన్ హస్తంపై చర్చ జరిగింది. ఇక తాజాగా రిపబ్లిక్ డే వేడుకలను పాకిస్తాన్ టార్గెట్ చేసినట్టు వార్తలు రావడం ఆందోళన కలిగిస్తోంది. గణతంత్ర దినోత్సవం(Republic Day) నాడు లేదా అంతకు ముందు జనవరి 26న, అంటే 26-26 అనే కోడ్ నేమ్ తో ఉగ్రవాద దాడి జరుగుతుందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
దీనితో బుధవారం ఢిల్లీలో భద్రతా దళాలు(Indian Army) హై అలర్ట్ ప్రకటించాయి. ఉగ్రవాదులు అయోధ్యలోని రామాలయం, జమ్మూలోని రఘునాథ్ ఆలయాలతో పాటు ఇతర దేవాలయాలు, నగరాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని భద్రతా దళాలకు సమాచారం అందిందని జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్, జైష్-ఎ-మొహమ్మద్ ద్వారా మరియు పంజాబ్‌కు చెందిన గ్యాంగ్స్టర్ల సహాయంతో ఈ దాడిని ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.
నవంబర్‌లో ఎర్రకోట వెలుపల జరిగిన కార్ బాంబు దాడికి జైషే మహ్మద్ బాధ్యత వహించింది. ఇందులో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో రిపబ్లిక్ డే వేడుకలకు ముందు భద్రతా బలగాలు.. ఢిల్లీలో ముఖ్యంగా బస్, రైల్వే స్టేషన్ల వంటి ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్ల వద్ద వాంటెడ్ వ్యక్తుల పోస్టర్లను ఏర్పాటు చేశాయి. వీరిలో ఢిల్లీకి చెందిన చౌహాన్ బంగర్‌కు చెందిన మొహమ్మద్ రెహాన్ కూడా ఉండటం గమనార్హం. అతను 2016లో ఉత్తరప్రదేశ్ లోని సంభాల్‌లో అల్ ఖైదా మాడ్యూల్‌ను చేధించిన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
జాబితాలో ఉన్న వారిలో మొహమ్మద్ ఉమర్, అబు సుఫియాన్, మొహమ్మద్ షాహిద్ ఫైసల్, సయ్యద్ అర్షియా మరియు షార్జీల్ అక్తర్ ఉన్నారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు యధావిధిగా భద్రతను కట్టుదిట్టం చేసాయి. ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడతాయని నిఘా వర్గాలు హెచ్చరించిన తర్వాత, పంజాబ్‌కు చెందిన కొందరు నేరస్థులు దాడులకు సహకారం అందించే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. దీనితో నిఘాను మరింత అప్రమత్తం చేసాయి బలగాలు. కాశ్మీర్‌కు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ తో లింక్ అయి పని చేస్తున్న ఉగ్రవాద యూనిట్.. ‘ఫాల్కన్ స్క్వాడ్’ ఇటీవల హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌కు చెందిన మరొక ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన అనుబంధ శాఖగా భావిస్తున్నారు.






