RO-KO: రోహిత్, కోహ్లీకి షాక్ తప్పదా..?
సాధారణంగా సీనియర్ ఆటగాళ్ల విషయంలో ఎప్పుడు ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంటుంది. గతంలో గంగూలి, ద్రావిడ్, సచిన్, లక్ష్మణ్ విషయంలో మీడియా హడావుడి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohith Sharma) విషయంలో హడావుడి ఎక్కువగా జరుగుతుంది. తాజాగా వాళ్ళిద్దరి గ్రేడ్ మార్పులకు సంబంధించి చర్చ మొదలైంది. సెంట్రల్ కాంట్రాక్టులో ఏ ప్లస్ గ్రేడ్ లో ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గ్రేడ్లను మార్చే దిశగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అడుగులు వేస్తోంది అనే వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం సెంట్రల్ కాంట్రాక్టులో ఏ ప్లస్ గ్రేడ్ తో కొనసాగుతున్నారు. అయితే వీళ్ళిద్దరిని ఏ గ్రేడ్ కు మార్చాలని ఇటీవల బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దానికి సంబంధించి కొంత చర్చి జరిగింది. ఆస్ట్రేలియాలో గాని సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి వన్డే సిరీస్ లో గాని, ఇటీవల జరిగిన న్యూజిలాండ్ తో జరిగినటువంటి వన్డే సిరీస్ లో గాని మైదానానికి భారీగా అభిమానులు రావడంలో, వీళ్ళిద్దరూ కీలకపాత్ర పోషించారు. దానికి తోడు ఇద్దరు మంచి ఫామ్ లో కూడా ఉండటంతో, వాళ్ళిద్దరికీ సంబంధించి అనవసరంగా తొందరపడకూడదు అనే సలహాలను కూడా, కొంతమంది మాజీ క్రికెటర్లు ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి.
వాటిపై సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద చర్చ జరిగింది. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరికీ సంబంధించి మరో వార్త కూడా బయటకు వచ్చింది. ఏ గ్రేట్ కాదని బి గ్రేడ్ కి వీళ్ళిద్దరిని మారుస్తారని ప్రచారం జరుగుతుంది. స్టార్ ఆటగాళ్లుగా జట్టులో కీలకపాత్ర పోషిస్తున్న ఈ ఇద్దరిని, బి గ్రేడ్ కు మార్చాలని బోర్డు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరు ప్రస్తుతం ఏడు కోట్ల వరకు వార్షిక వేతనం అందుకుంటున్నారు. ఒకవేళ బి గ్రేడ్ గా మారిస్తే, అది భారీగా పడిపోయే అవకాశం ఉంది. ఐదు కోట్ల వరకు వార్షిక వేతనం అందిస్తూ ఉంటుంది బోర్డు. అయితే టి20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత జట్టులో కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి సెంట్రల్ కాంట్రాక్టులకు సంబంధించి అప్పుడు నిర్ణయం తీసుకోవాలని బోర్డు పెద్దలు భావిస్తున్నట్లుగా సమాచారం.






