Ayodhya Temple: అయోధ్య రామయ్యకు 286 కిలోల ‘స్వర్ణ ధనుస్సు’!
అయోధ్యలోని రామ మందిరంలోని (Ayodhya Temple) రామ్‌లల్లాకు (బాలరాముడు) భక్తులు అరుదైన, అత్యంత విలువైన కానుకలు సమర్పించారు. ఒడిశాకు చెందిన కొందరు భక్తులు బాలరాముడికి ఏకంగా 286 కిలోల స్వర్ణ ధనుస్సును కానుకగా సమర్పించారు. ఈ భారీ స్వర్ణ ధనుస్సును తమిళనాడులోని కాంచీపురంలో దాదాపు 40 మంది మహిళా శిల్పులు ఎంతో భక్తిశ్రద్ధలతో రూపొందించారు. దీని తయారీకి సుమారు రూ.1.10 కోట్లు ఖర్చయినట్లు అంచనా. అత్యంత నైపుణ్యంతో చెక్కిన ఈ ధనుస్సు (Golden Bow) చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఒడిశాలోని రూర్కెలా నుండి ప్రారంభమైన “శ్రీ రామ స్వర్ణ ధనుష్ యాత్ర” భువనేశ్వర్, బర్గఢ్, రాయగడ, పర్లాకిమిడి మీదుగా సాగింది. పూరీ జగన్నాథుని సన్నిధికి చేరుకున్నప్పుడు భక్తులు ఈ స్వర్ణ ధనస్సుకు (Golden Bow) ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. ఈ అపురూపమైన కానుకను జనవరి 22న అయోధ్యలో (Ayodhya Temple) రామయ్యకు అంకితం ఇవ్వనున్నారు.






