India-EU: భారత్-ఈయూ మధ్య ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’.. దావోస్ వేదికగా కీలక ప్రకటన!
భారత్, యూరోపియన్ యూనియన్ (India-EU) మధ్య సంబంధాలు సరికొత్త చరిత్రను లిఖించే దిశగా అడుగులు వేస్తున్నాయి. త్వరలోనే భారత్‌తో అతిపెద్ద వాణిజ్య ఒప్పందాన్ని (Free Trade Agreement) ఖరారు చేసుకోబోతున్నట్లు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లీయన్ ప్రకటించారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఆమె మాట్లాడుతూ.. ఈ ఒప్పందాన్ని “మదర్ ఆఫ్ ఆల్ డీల్స్” గా అభివర్ణించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ ఒప్పందం అమల్లోకి వస్తే సుమారు 200 కోట్ల మంది ప్రజలతో కూడిన భారీ (India-EU) మార్కెట్ ఏర్పడుతుంది. ఇది ప్రపంచ జీడీపీలో 25 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. చైనాపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించుకుని, విశ్వసనీయ భాగస్వామి అయిన భారత్‌తో వాణిజ్యాన్ని పెంచుకోవడమే ఈయూ ప్రధాన లక్ష్యం. 2023లోనే ఇరు వర్గాల మధ్య రికార్డు స్థాయిలో 124 బిలియన్ యూరోల వాణిజ్యం జరిగింది. ఈ డీల్ ద్వారా భారత ఎగుమతులకు 27 యూరోపియన్ దేశాల మార్కెట్ల ద్వారాలు తెరుచుకుంటాయి, తద్వారా దేశీయ తయారీ రంగానికి భారీ ఊతం లభిస్తుంది.
ఈ (India-EU) డీల్ దాదాపు ఖరారైనప్పటికీ, కొన్ని కీలక అంశాలపై ఇంకా ఏకాభిప్రాయం రావాల్సి ఉంది. ఆటోమొబైల్స్, వైన్, స్పిరిట్స్‌పై దిగుమతి సుంకాలు తగ్గించాలని ఈయూ పట్టుబడుతుండగా.. దేశీయ పరిశ్రమల రక్షణ కోసం భారత్ ఆలోచిస్తోంది. మరోవైపు భారతీయ నైపుణ్యం గల ఉద్యోగులకు యూరప్‌లో సులభంగా పని చేసే వెసులుబాటు కల్పించాలని భారత్ డిమాండ్ చేస్తోంది.యూనియన్‌లోని 27 దేశాల్లో వేరు వేరు నిబంధనలు ఉండటంతో ఈ పని చేయడం ఈయూకు సమస్యగా మారింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉర్సులా వాన్ డర్ లీయన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ పర్యటనలోనే పెండింగ్‌లో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుని, జనవరి 27న ఈ (India-EU) చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.






