Davos: సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి ఐనాక్స్ గ్రూప్ ఆసక్తి
తెలంగాణను కాలుష్య రహిత మహానగరంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఐనాక్స్ గ్రూప్ డైరెక్టర్ దేవాంశ్ జైన్‌తో సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా సోలార్ మాడ్యూల్స్ సహా ఆధునిక, సుస్థిర తయారీ రంగాల్లో సహకార అవకాశాలపై చర్చించారు.
ఐనాక్స్ గ్రూప్ తెలంగాణలో సౌర , పవన విద్యుత్ ఉత్పత్తి చేపట్టి, ఆ తర్వాత తయారీ రంగంలోకి విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కాలుష్యం లేని విద్యుత్ (క్లీన్ ఎలక్ట్రిసిటీ) , గ్రీన్ హైడ్రజన్ అందిచాలనే ప్రణాళికలు ప్రభుత్వం రూపొందిస్తున్నది అని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. డేటా సెంటర్ల నుంచి అధిక స్థాయిలో పునరుత్పాదక విద్యుత్ అవసరం పెరుగుతోందని చెప్పారు. నూతన తెలంగాణ ఎనర్జీ పాలసీ కింద అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌లో భాగంగా క్యూర్ ప్యూర్ రేర్ (CURE–PURE–RARE ) ఫ్రేమ్‌వర్క్ ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ , హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.






