Telangana Jagruthi: మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ!
త్వరలో జరగబోయే పురపాలక సంఘ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) నిర్ణయించింది. మరోవైపు ఆ పార్టీ ముఖ్య నేతలు రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్‌లో (Registration) వేగం పెంచారు. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో మున్సిపాలిటీ, ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికల్లో ఆలఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌కు చెందిన సింహం గుర్తుతో పోటీ చేయాలని చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏఐఎఫ్బీ రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఉమ్మడి గుర్తు కోసం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బీఫారంతో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






