TTD: తిరుమల శ్రీవారికి భారీ విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ) లోని వివిధ ట్రస్టులకు హైదరాబాద్‌కు చెందిన పి.ఎల్.రాజు (P.L. Raju) కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ సంస్థ రూ.2.50 కోట్ల విరాళాలు అందజేసింది. శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.75 లక్షలు, శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.75 లక్షలు, బర్డ్ ట్రస్టుకు రూ.50 లక్షలు, శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.25 లక్షలు, శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టుకు రూ.25 లక్షల చొప్పున తీసిన డీడీలను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి (Venkaiah Chowdary)కి సంస్థ ప్రతినిధి రాజగోపాలరాజు (Rajagopalaraju) అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి (Bhanu Prakash Reddy), ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






