Swarnandhra:విద్యా వ్యవస్థలో మంత్రి విప్లవాత్మక మార్పులు : హోం మంత్రి అనిత
అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తేగాడ మోడల్ స్కూల్లో స్వర్ణాంధ్ర (Swarnandhra)-స్వచ్ఛాంధ్ర (Swachh Andhra) కార్యక్రమంలో హోం మంత్రి అనిత (Home Minister Anita) పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. క్రీడా మైదానం కావాలని విద్యార్థులు కోరగా, ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులతో కలిసి హోం మంత్రి కేక్ కట్ చేశారు. చిన్న పొరపాట్ల వల్ల విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. పిల్లలకు చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు.






