T Hub: టీహబ్ ను స్టార్టప్ ల కేంద్రంగానే కొనసాగించాలి
టీహబ్ ను స్టార్టప్ ల కేంద్రంగానే కొనసాగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. ఈ అంశంపై సీఎస్ రామకృష్ణ రావు ( CS Ramakrishna Rao) కు అమెరికా (America) నుంచి ఫోన్ చేసి సీఎం మాట్లాడారు. అద్దె భవనాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను టీహబ్‌కు (T Hub) మారుస్తున్నారనే వార్తలను ఖండించారు. టీహబ్‌లో ఇతర ఆఫీసులు (Offices) ఉండకూడదని ఆదేశించారు. అలాంటి ఆలోచనలు అధికారులు విరమించుకోవాలన్నారు. అద్దె భవనాల్లోని ప్రభుత్వ ఆఫీసులను ఇతర ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని సీఎం సూచించారు.






