Bandi Sanjay: ఈ కేసులో ఒక్క రాజకీయ నేతనైనా అరెస్ట్ చేశారా? : బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ కేసు లో సిట్ విచారణ సీరియల్లా కొనసాగుతోందని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఎద్దేవా చేశారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడారు. దొంగే దొంగ అన్నట్లు కేటీఆర్ (KTR) వ్యవహారం ఉందన్నారు. కేటీఆర్ సిరిసిల్ల కేంద్రంగా అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేయించారు. ఆయన చేసిన దారుణాలతో కొన్ని కుటుంబాలు మునిగాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి అరెస్ట్‌లు జరగవు. కేసీఆర్ (KCR) కుటుంబసభ్యులను అరెస్ట్ చేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు. దేశభద్రత కోసం జరిగే ట్యాపింగ్‌కు, తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధమే లేదు. మావోయిస్టుల (Maoists) పేరుతో హీరోయిన్లు, వ్యాపారులు, రాజకీయ నేతలు, జడ్జీల ఫోన్లు ట్యాప్ చేశారు. సిట్‌లో మంచి అధికారులు ఉన్నారు. కానీ ప్రభుత్వం వారికి స్వేచ్చను ఇవ్వడం లేదు. ఈ కేసులో ఒక్క రాజకీయ నేతనైనా అరెస్ట్ చేశారా? మా ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే కేసీఆర్ కుటుంబ సభ్యులపై చర్యలు చేపట్టేవాళ్లం. తప్పు చేసిన నేతలు, అధికారులను అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారు.






