KTR: అటెన్షన్ డైవర్షన్ కోసమే.. సిట్ విచారణ పేరుతో కుట్రలు : కేటీఆర్
ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసులో సిట్ విచారణకు పది సార్లు పిలిచినా హాజరవుతానని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. సిట్ విచారణకు వెళ్లనున్న నేపథ్యంలో తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనిలేదని చెప్పారు. అటెన్షన్ డైవర్షన్ కోసమే సిట్ విచారణ పేరుతో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రులతో పాటు మా అందరి ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ట్యాప్ చేయిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఆరు గ్యారంటీలు, సింగరేణి బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దష్టిని మళ్లించేందుకే ఈ కుట్రలు చేస్తున్నారు. నాలుగు కోట్ల ప్రజలను నయవంచన చేసిన ముఖ్యమంత్రిని వదిలిపెట్టం. సిట్ (SIT) విచారణలో ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్తాను. ఈ కేసులు మాకు కొత్తమే కాదు, బెదిరింపులకు భయపడం. కొత్తనాటకాలతో కాలయాపన చేస్తున్నారు అని అన్నారు.






