Sri Chidambaram Garu: ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా ‘శ్రీ చిదంబరం గారు’ విడుదల
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వినయ్ రత్నం తెరకెక్కించిన చిత్రం ‘శ్రీ చిదంబరం’. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఇటీవల టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌కు వచ్చిన అనూహ్య స్పందన గురించి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి గారు ఆలపించిన ‘వెళ్లేదారిలో’ అనే ఓ పాట బ్యూటిఫుల్ పాటను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. చందు, రవి సంగీతం అందించిన ఈ పాటకు చంద్రశేఖర్ సాహిత్యాన్ని సమాకూర్చారు. ఈ పాట ట్యూన్‌తో పాటు లిరిక్స్ అందరి హృదయాలను హత్తుకుంటున్నాయి. ముఖ్యంగా కీరవాణి గారి గాత్రం ఈ పాటకు ప్రాణం పోసింది. కాగా ఈ పాట సక్సెస్ సెలబ్రేషన్స్‌తో పాటు చిత్ర విడుదల తేది ప్రకటన ప్రెస్‌మీట్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్రాన్ని ఫిబ్రవరి 6న ప్రపంచ వ్యాప్తంగా థ్రియేట్రికల్ విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్.
ఈ సందర్భంగా ఈ వేడుకకు ముఖ్య అథిగా విచ్చేసిన ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ ” యంగ్ టీమ్ చేసిన బ్యూటిఫుల్ సినిమా ఇది. ఈ రోజు వేదిక మీద ఇంత మంది మ్యూజిక్ డైరెక్టర్లును చూస్తుంటే ముచ్చటగా ఉంది. ఈ రోజు రవి, చందులు కీరవాణి లాంటి గొప్ప సంగీత దర్శకుడిని ఒప్పించి పాడించడం ఎంతో ఆనందంగా ఉంది. చాలా మెచ్యూర్డ్ అండ్ ఇన్స్పిరేషన్ స్టోరీతో రాబోతున్న సినిమా ఇది. నేటి సమాజానికి ఎంతో అవసరమైన కథ ఇది. చాలా మంది యువత చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కే సూసైడ్ వరకు వెళ్లిపోతున్నారు. అలాంటి వారందరికి ఎంతో ఇన్‌స్పయిర్ అయ్యే కథ ఇది. మీలో లోపం మీకు బలం అవ్వాలి అనే చెప్పే కథ ఇది. ఈ సినిమాలో వంశీ కళ్లతో యాక్ట్ చేశాడు. టీమ్ అందరికి గుడ్ లక్’ అన్నారు. సంగీత దర్శకుడు చందు రవి మాట్లాడుతూ ‘శ్రీ చిదంబరం గారు’ టీమ్‌ను, దర్శకుడిని ఇంట్రడ్యూస్ చేసిన వంశీ నందిపాటి గారికి థ్యాంక్స్. చెప్పాలనకున్న పాయింట్‌తో మంచి మనసుతో చెప్పిన సినిమా ఇది. కీరవాణి గారితో పాట పాడించడం. ఆనందంగా ఉంది. ఎంతో ముచ్చట పడి కళ్లద్దాలు పెట్టుకుని పాడటం మాకు ఎంతో సంతోషమేసింది’ అన్నారు.
నిర్మాత గోపాలకృష్ఱ మాట్లాడుతూ కొత్తవాళ్లను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో నేను చేసిన ఐదో సినిమా ఇది. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాను. ఓ పెద్ద సినిమాకు తీసిపోని సినిమా. వంశీ నందిపాటి ఈ సినిమాకు మొదట్నుంచీ సపోర్ట్ చేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆయనే సినిమాను పంపిణి చేస్తున్నారు. కంటెంట్ ఉన్న గొప్ప సినిమా ఇది. నిర్మాతగా నేను ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఇది’ అన్నారు.
హీరోయిన్ సంద్యా వశిష్ట మాట్లాడుతూ ” సినిమాలో లీల అనే పాత్రను చేస్తున్నాను. టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఫీల్‌గుడ్ స్టోరీ మలయాళం సినిమా వైబ్ ఉంటుంది. చందు, రవి పాటలతో ఈ సినిమాకు లైఫ్ ఇచ్చారు. కీరవాణి గారు వెళ్లేదారిలో అనే పాటను పాడి ఆ పాటకు లైఫ్ ఇచ్చారు. ఈ సినిమా ఆర్టిస్టులుగా మాకు మంచి పేరు తెస్తుంది అన్నారు.
హీరో వంశీ తుమ్మల మాట్లాడుతూ ” సంగీతంతో మా సినిమా వందరెట్లు పైన వుంది. ఆస్కార్ పాటను ట్యూన్ చేసిన కీరవాణి గారు పాటను పాటడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను మెల్లకన్ను పెట్టి నటించడానికి ఆర్పీ పట్నాయక్ గారి నటనే ఇన్స్పిరేషన్. నిర్మాత గారు ఎక్కడా రాజీపడకుండా, సినిమాను ప్రేమించి, సినిమాను హైక్వాలిటిలో నిలబెట్టారు. హిట్ మిషన్ వంశీ నందిపాటి 2026లో నచ్చి చేస్తున్న మొదటి సినిమా. మంచి ఎమోషనల్ రైడ్ ఈ సినిమా’ అన్నారు.
వినయ్ రత్నం మాట్లాడుతూ ” ఈ సినిమా కార్యరూపం దాల్చడానిక ప్రధాన కారణం మా నిర్మాత గోపాల కృష్ణ గారు. ఈ సినిమాలో ప్రతి సాంగ్ అందరి హృదయాలకు హత్తుకుంటుంది. సినిమాను ఫైనల్ మిక్సింగ్‌లో చూసుకుని ఏడ్చాను. చాలా కష్టపడి సినిమా తీశాం. అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అన్నారు.






