Iphone: ఐఫోన్ రిలీజ్ పై ఆపిల్ కీలక నిర్ణయం..!
ఐఫోన్.. టెక్ ప్రియులకు ఎంతో ఇష్టమైన మొబైల్ ఇది. ధర ఎంతైనా సరే కిడ్నీ అమ్మి కూడా కొనుక్కోవడానికి ఐఫోన్ ప్రియులు వెనుకాడరు అంటూ సెటైర్ లు కూడా మనం వింటూనే ఉంటాం. అంతర్జాతీయంగా ఈ ఫోన్ కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మన భారత్ లో అయితే దీని మార్కెట్ గత నాలుగేళ్లలో భారీగా పెరిగిన మాట వాస్తవం. ప్రస్తుతం ఐఫోన్ 17(Iphone 17) మార్కెట్ లో ఉన్న హైఎండ్ ఫోన్ కాగా.. త్వరలోనే దీని తర్వాతి వెర్షన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం కనపడుతోంది.
ఐఫోన్ వినియోగదారులు ఎంతగానో ఎదురు చూస్తున్న.. ఐఫోన్ 18 ప్రో మోడళ్లకు డిస్ ప్లే అప్ గ్రేడ్ న్యూస్ లు, కొత్త చిప్, ఇతర ఫీచర్స్ గురించి కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అన్ని మోడల్స్ ఒకే సారి లాంచ్ చేయకుండా విడివిడిగా లాంచ్ చేయాలని యాపిల్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ యొక్క అన్ని కొత్త ఫీచర్లు ఒక్కసారి చూస్తే, ప్రో మరియు ప్రో మాక్స్ 6.27-అంగుళాల 120Hz, 6.86-అంగుళాల 120Hz అలాగే ఉంటాయని సమాచారం.
ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్(Iphone 17 Pro max) మాదిరిగానే ఉంటాయి. డైనమిక్ ఐలాండ్‌కు బదులుగా కొత్త అండర్-డిస్ ప్లే ఇచ్చే ఛాన్స్ కనపడుతోంది. ఐఫోన్ ప్రతి సంవత్సరం కొత్త చిప్ అందిస్తోంది. ఐఫోన్ 18 ప్రో కోసం ఏ20 ప్రో చిప్ తీసుకొస్తారు. ఇది 2nm ప్రాసెసర్ తో తయారు చేసిన ఆపిల్ మొట్టమొదటి చిప్ కానుంది. వేఫర్-లెవల్ మల్టీ-చిప్ మాడ్యూల్ ప్యాకేజింగ్ కూడా యాపిల్ వాడుకునే ఛాన్స్ ఉంది. బ్యాక్ కెమెరాలో కనీసం ఒక దానిలో మెకానికల్ ఐరిస్ ఉండే ఛాన్స్ ఉంది.
వేరియబుల్ ఎపర్చరు కంట్రోల్ ను ఇది అందిస్తుంది. మన దేశంలో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ సెప్టెంబర్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతీ ఐఫోన్ ఇప్పుడే రిలీజ్ చేస్తారు. కానీ ఈసారి మిగిలిన మోడల్స్ మాత్రం 2027 ప్రారంభంలో రిలీజ్ చేస్తారు. ఐఫోన్ 18 ప్రో ధర రూ.1,34,900, ఐఫోన్ 18 ప్రో మాక్స్ ధర రూ.1,49,900గా ఉండవచ్చని అంతర్జాతీయ మీడియా తెలిపింది. స్టోరేజ్ లను బట్టి ధర మారే ఛాన్స్ ఉంది.






