Axis Bank: వార్షిక ఆర్ట్, క్రాఫ్ట్, లిటరేచర్ పోటీ SPLASH 2025 నిర్వహణకు భారత్‌వ్యాప్తంగా 995 పైగా పాఠశాలలతో యాక్సిస్ బ్యాంక్ జట్టు
సదరన్ రీజియన్: భారతదేశపు అతి పెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్, తమ వార్షిక ఆర్ట్, క్రాఫ్ట్, లిటరేచర్ కాంపిటీషన్ అయిన SPLASH 2025 యొక్క 13వ ఎడిషన్‌ని విజయవంతంగా నిర్వహించింది. దేశవ్యాప్తంగా 995 పైగా పాఠశాలల నుంచి విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. యాక్సిస్ బ్యాంక్ బ్రాండ్ సిద్ధాంతమైన – దిల్ సే ఓపెన్ స్ఫూర్తితో, తమలోని సృజనాత్మకతను వెలికితీసేలా విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఈ ఏడాది ‘డ్రీమ్స్’ అనే థీమ్‌పై నిర్వహించిన పోటీల్లో 2.66 లక్షల మంది పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.
దక్షిణాది రీజియన్‌లో హైదరాబాద్, బెంగళూరు, గుంటూరు, బాగల్కోట్, విశాఖపట్నం, కడపా, నెల్లూరు తదితర నగరాల్లో 308 పాఠశాలలవ్యాప్తంగా బ్యాంకు ఈ పోటీలను నిర్వహించింది. వీటిల్లో 1.01 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. 7-10 ఏళ్ల వయస్సు వారు ‘ఎ డే ఇన్ మై డ్రీమ్ లైఫ్’ పేరిట, 11-14 ఏళ్ల వారు ‘ది ఫ్యూచర్ యాజ్ ఐ డ్రీమ్ ఇట్’ పేరిట రెండు థీమ్‌ల కింద ఎంట్రీలను సమర్పించారు.
ఈ థీమ్‌కి అనుగుణంగా తమ ఆకాంక్షలకు రూపునివ్వడంలో పిల్లలకు తోడ్పడేలా యాక్సిస్ బ్యాంక్ ప్రత్యేకంగా ‘ఏఐ డ్రీమ్ జెనరేటర్’ పేరిట ఒక ఇంటరాక్టివ్ డిజిటల్ టూల్‌ని రూపొందించింది. ఎగిరే కార్లు, మాట్లాడే జంతువుల నుంచి చందమామ మీద నగరాలను నిర్మించడం వరకు పిల్లలు తమ డ్రీమ్స్‌ని ఎంటర్ చేసి, ఫేవరెట్ మాధ్యమాన్ని, అంటే – ఆర్ట్, క్రాఫ్ట్ లేదా లిటరేచర్- ఎంచుకుని, తమ ఊహలకు ఒక రూపమిచ్చి, ఆస్వాదించేందుకు ఇది తోడ్పడుతుంది.
ఈ పోటీల్లో ఆరుగురు నేషనల్ విన్నర్లు, ఆరుగురు నేషనల్ రన్నర్సప్ ఉంటారు. వీరికి వరుసగా తలో రూ. 1 లక్ష మరియు రూ. 50,000 బహుమతి ఉంటుంది. అలాగే వారు దుబాయ్‌లోని తాష్కీల్‌లో జరిగే ప్రత్యేక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్‌షాప్‌కి హాజరయ్యేందుకు కూడా అవకాశం లభిస్తుంది. విజేతల ఆర్ట్‌వర్క్‌లు బెంగళూరులోని మ్యూజియం ఆఫ్ ఆర్ట్ అండ్ ఫొటోగ్రఫీ (MAP)లో ప్రదర్శించబడతాయి. అంతేగాకుండా టాప్ 400 క్వాలిఫయర్లకు ఇక్సిగో మరియు అమెరికన్ టూరిస్టర్లాంటి భాగస్వామ్య బ్రాండ్స్ నుంచి ఆకర్షణీయమైన బహుమతులు మరియు ఓచర్లు లభిస్తాయి.






