Toxic: టాక్సిక్ లో ఎవరెంత తీసుకుంటున్నారంటే?
జిఎఫ్(KGF) సినిమాలతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యష్(Yash) ప్రస్తుతం టాక్సిక్(Toxic) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గీతూ మోహనదాస్(Geethu mohandas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతుంది. అందుకోసమే టాక్సిక్ ను ఒకేసారి హాలీవుడ్ లో కూడా షూట్ చేస్తున్నారు.
అయితే టాక్సిక్ ను కేవలం హాలీవుడ్ లో తెరకెక్కించడమే కాకుండా ఆ సినిమాకు అక్కడ బజ్ తెచ్చేందుకు అక్కడి టెక్నీషియన్లను తీసుకుని సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్న గీతూ, ఈ సినిమాలో భారీ తారాగణాన్నే ఎంపిక చేసుకున్నారు. రీసెంట్ గా యష్ బర్త్ డే సందర్భంగా టాక్సిక్ టీజర్(Toxic Teaser) ను రిలీజ్ చేయగా, ఈ టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలా ఉంటే రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించే వారి రెమ్యూనరేషన్ల గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది. ఈ సినిమా కోసం యష్ రూ.50 కోట్లు, కియారా అద్వానీ(Kiara Advani) రూ.15 కోట్లు, నయనతార(Nayanthara) రూ.12-16 కోట్లు, రుక్మిణి వసంత్(Rukmini Vasanth) 3-5 కోట్లు, తారా సుతారియా(Tara Sutaria), హుమా ఖురేషి(Huma Khureshi)లు 2-3 కోట్లు తీసుకుంటున్నారని అంటున్నారు. అంటే టాక్సిక్ బడ్జెట్ లో ఎక్కువ ఖర్చు క్యాస్టింగ్ కోసమే అవుతుందన్నమాట. కాగా టాక్సిక్ మార్చి 19న రిలీజ్ కానుంది.






