Infosys: విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్
విశాఖపట్నంలో ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys) తన కార్యకలాపాలను విస్తరించడానికి భూమి కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఏపీఐఐసీ (APIIC) అధికారులతో కలిసి పరదేశిపాలెం, ఎండాడ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న భూములను పరిశీలించింది. హైవేను ఆనుకొని ఎండాడలో దిశ పోలీస్ స్టేషన్ ఉన్న కొండపై 20 ఎకరాలు కేటాయించాలని, శాశ్వత క్యాంపస్ నిర్మాణం చేపడతామని దరఖాస్తు చేసింది. టీసీఎస్‌కు (TCS), కాగ్నిజెంట్ (Cognizant) కంపెనీలకు ఎకరా 99 పైసలు చొప్పున ఇచ్చినట్లుగానే తమకూ భూములు కేటాయిస్తే భారీ సంఖ్యలో ఉద్యో గావకాశాలు కల్పిస్తామని ప్రతిపాదించింది. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






