Bandla Ganesh: ప్రముఖ నటుడు బండ్ల గణేశ్ పాదయాత్ర
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) తిరుమల వేంకటేశ్వర స్వామి మొక్కు తీర్చుకోనున్నారు. షాద్‌నగర్ నుంచి తిరుమల వరకు మహా పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసు (Skill development case)లో అరెస్ట్ అయిన సమయంలో బండ్ల గణేశ్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చంద్రబాబు నాయుడు నిర్దోషిగా విడుదల కావాలని, తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆయన తిరుమల (Tirumala) శ్రీవారికి మొక్కుకున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
2024 ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించి చంద్రబాబు మళ్లీ సీఎం అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మొక్కును తీర్చుకునేందుకు బండ్ల గణేశ్ సిద్ధమయ్యారు. చంద్రబాబు పట్ల తనకున్న అభిమానాన్ని ఈ యాత్ర ద్వారా బండ్ల గణేశ్ చాటుకుంటున్నారు. తాజాగా ఆయన ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడమే కాకుండా, తన రాజకీయ అభిమానాన్ని కూడా చూపనున్నారు. బండ్ల గణేశ్ ఈ నెల 19వ తేదీన షాద్‌నగర్‌లోని తన స్వగృహం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్నట్లు చెప్పుకొచ్చారు. రాజకీయ, సినీ వర్గాల్లో ఈ నిర్ణయం ఆసక్తికరంగా మారింది.






