Yanamala: జగన్ పదేపదే అక్కడికి వెళ్లడం వెనుక ఆంతర్యమేంటి? :యనమల రామకృష్ణుడు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో యనమల మీడియాతో మాట్లాడారు. అవినీతి కార్యకలాపాలకు బెంగళూరు (Bengaluru) ప్యాలెస్‌ను కేంద్రంగా చేసుకున్నారంటూ ఆక్షేపించారు. బెంగళూరులోనే జగన్ (Jagan) మకాం వేయడంపై అనేక అనుమానాలు వస్తున్నాయని విమర్శించారు. తన అవినీతి సంపదను జగన్ బెంగళూరు ప్యాలెస్‌కు తరలించారని అన్నారు. బెంగళూరు జగన్ జన్మస్థలం కాదని, సొంత నియోజకవర్గం కానే కాదని చెప్పుకొచ్చారు. కానీ అక్కడికి పదేపదే వెళ్లడం వెనుక ఆంతర్యమేంటి?. జగన్ పార్టీ కేంద్ర కార్యాలయం కూడా కాదని, కనీసం హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసం కాదని, అలాంటప్పుడు జగన్ బెంగళూరు యలహంక ప్యాలెస్‌లో ఎందుకు మకాం వేస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy) సీఎంగా ఉన్నప్పుడు కూడా జగన్ బెంగళూరు కేంద్రంగానే అనేక కుట్రలకు తెర లేపారని ఆరోపించారు. నాడు వైఎస్ హయాంలో బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగానే అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని విమర్శించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






