MSVG: చిరంజీవి గారు, వెంకటేష్ గారి కాంబినేషన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సినిమా ప్రమోషన్లు అద్భుతంగా జరుగుతున్నాయి. ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచాయి. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
లాస్ట్ ఇయర్ రిలీజ్ టైం కి నెర్వస్ గా ఉంది అని చెప్పారు.. ఈ ఇయర్ ఎలా అనిపిస్తోంది?
-ఈసారి కొద్దిగా రిలాక్స్ గా ఉన్నాను. నెర్వస్ పర్సంటేజ్ కొంచెం తగ్గింది. దానికి కారణం చిరంజీవి గారు. ప్రీరిలీజ్ ఈవెంట్లో హుక్ స్టెప్ సాంగ్ రిలీజ్ చేసాము. ఆ పాటకి చిరంజీవి గారు వేసిన డాన్స్, ఆ ఈవెంట్లో ఆయన ముందు నేను వెంకటేష్ గారు చేసిన అల్లరి ఇదంతా తెలియకుండా ఒక పాజిటివ్ వైబ్ తీసుకొచ్చేసింది. దీంతో చాలా రిలాక్స్ అయ్యాను.
హుక్ స్టెప్ వైరల్ గా మారింది కదా?
-ఆ సాంగ్ వెనుక ఒక కథ ఉంది. నిజానికి ఆ ప్లేస్ లో ఒక మెలోడీ మాస్ ట్యూన్ అనుకున్నాము. మీసాల పిల్ల, శశిరేఖ ఈ రెండు పాటలు కూడా మెలోడీ సాంగ్స్. చిరంజీవి గారి ఇంట్రడక్షన్ సాంగ్ కూడా మళ్లీ మెలోడీ అయితే ఎలా అని ఆలోచించాను. సాంగ్ అంత సంతృప్తికరంగా లేదని చిరంజీవి గారికి చెప్పాను. సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు వర్షం పడి షూటింగ్ ఆగిపోయింది. నేచర్ సిగ్నల్ ఇచ్చిందని చిరంజీవి గారు చెప్పారు. ఆయనే సిగ్నల్ ఇచ్చారు కదా అని.. అప్పుడు ఈ సాంగ్ ని ఆలోచించడం మొదలుపెట్టాం. శశిరేఖ ప్లేస్ లో రిలీజ్ అవ్వాల్సిన పాట ఇదే. మొత్తం షూట్ అయ్యాక లాస్ట్ షెడ్యూల్లో ఈ సాంగ్ షూట్ చేశాం. ఫైనల్ గా మెగా మ్యాజిక్ జరిగింది.
భీమ్స్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చాడు.చాలా కొత్తగా చేశారు. ఆట సందీప్ ఎప్పటినుంచో చిరంజీవి గారి పాటకి కొరియోగ్రఫీ చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమాకి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని నిలబెట్టుకున్నాడు. అద్భుతమైన కొరియోగ్రఫీ చేశాడు. హుక్ స్టెప్ అనే పదం ఇచ్చింది పాట రాసిన రామజోగయ్య గారే.
మ్యూజిక్ విషయంలో ఎక్కువగా లోకల్ టెక్నీషియన్ తో పని చేస్తుంటారు.. కారణం?
భీమ్స్ ఎక్కువగా కొత్త, లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తుంటాడు. సంక్రాంతికి వస్తున్నాంలో బ్లాక్ బస్టర్ పొంగల్ పాట పాడింది కూడా లోకల్ సింగర్స్. ఈ సినిమాలో మీసాల పిల్ల సాంగ్ కోసమే ఉదిత్ గారు, హుక్ స్టెప్ బాబాసాహెల్ గారు పాడారు.
– కొరియోగ్రాఫర్స్ లో భాను మాస్టర్, విజయ్,. ఆట సందీప్ అద్భుతంగా ప్రూవ్ చేసుకున్నారు. మన లోకల్ టెక్నీషియన్స్ అందరు కూడా వెలుగులోకి వస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది.
మీరు సంక్రాంతికి వస్తే తిరుగు లేదనే ట్రాక్ రికార్డు వచ్చింది కదా?
అలా ఎక్కువగా ఒక ముద్ర పడటం కూడా మంచిది కాదు. ఒత్తిడి పెరుగుతుంది. సంక్రాంతి కొచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడనే అనే ఫీలింగ్ ఉంటే చాలు. మంచి కంటెంట్ తో ఎవరొచ్చినా సరే ఆ సినిమాలన్నీ ఆడతాయి. నా విషయంలో నేను ఎంచుకునే జోనర్స్ ఎక్కువగా మానవీయ సంబంధాలకి, ప్రతి ఫ్యామిలీ రిలేట్ అయ్యేలాగా ఉంటుంది. అది నాకు ప్లస్ అవుతుంది
ఈ సినిమాలో మీరు తీసుకున్న ఎమోషనల్ టచ్ ఏమిటి ?
ఇప్పటి వరకు టీజర్, ట్రైలర్లో ఎక్కడా కూడా రివిల్ చేయాలని ఒక ఎమోషనల్ పాయింట్ ఈ సినిమాలో ఉంది. అది మీరు స్క్రీన్ మీద చూడాలి. కామెడీతో పాటు ఒక బలమైన ఎమోషనల్ రైడ్ ఉంటుంది. చిరంజీవి గారు, నయనతార గారు, పిల్లల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా హృద్యంగా ఉంటాయి.
– భార్యాభర్తల మధ్య ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తారనేది చాలా కొత్త కోణంలో ఈ సినిమాలో చూపించడం జరిగింది. అది కచ్చితంగా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఆ ఎమోషన్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఇది కరెక్టే కదా అని ఫీల్ అవుతారు.
చిరంజీవి గారికి వెంకటేష్ గారికి ఒక కథ చేయడం అంటే చాలా కసరత్తు ఉంటుంది కదా.. ఈ కథ జర్నీ గురించి చెప్పండి?
-లక్కీగా నాకు మొదటి ఐడియానే హుక్ అవుతుంది. వెంకీ గారికి నాకు చాలా మంచి సింక్ ఉంటుంది. చిరంజీవి గారికి నేను చెప్పిన ఐడియా చాలా నచ్చింది. అలాగే క్యారెక్టరైజేషన్ కూడా చాలా నచ్చింది. ఈ మధ్యకాలంలో క్యారెక్టరైజేషన్ పాటు నడిచే కథ నేను చేయలేదు. ఒక కథని హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే తీసుకెళ్లడం అనేది నాకు కొత్తగా అనిపించింది.
-శంకర వరప్రసాద్ క్యారెక్టర్ కోపం వస్తే ఎలా ఉంటుంది.. నవ్వు వస్తే ఎలా ఉంటుంది..ప్రతి మూమెంట్లో ఎలా ట్రావెల్ అవుతాడు అనేది సినిమా అంతా ఆ క్యారెక్టర్ మనం పట్టుకునే వెళ్తాం.
-చిరంజీవి గారి కం బ్యాక్ తర్వాత అన్నయ్య, బావగారు బాగున్నారా, చూడాలని ఉంది లాంటి ఫ్యామిలీ జోనర్ ని ఆయన టచ్ చేయలేదు. అది ఎప్పుడు నాకు మైండ్ లో ఉంది. ఇది చాలా అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ వున్న జానర్. ఈ జానర్ లో ఆయనకు సినిమా చేయలానే ఆలోచనతో ఈ కథని రెడీ చేశాను.
-చిరంజీవి గారు చేసే అల్లరి ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ కూడా ఆడియన్స్ అందర్నీ ఒక టైం మిషన్లో తీసుకెళ్ళినట్టుగా వుంటాయి. ఆయన్ని నటుడిగా వ్యక్తిగా అభిమానించే అందరూ సినిమా చూసిన తర్వాత ‘వావ్’ అంటారనే నమ్మకం వుంది.
నయనతార గారు ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా చేశారు కదా? ఎలా కుదిరింది?
-నేను వర్క్ చేసే ప్రతి ఆర్టిస్టు టెక్నీషియన్స్ కి చాలా కంఫర్ట్ ఇస్తాను. మనం చాలా జెన్యూన్ గా ఒకటి అడుగుతున్నప్పుడు ఒక ఎమోషనల్ కనెక్షన్ అవతలి వాళ్ళకి జనరేట్ అయినప్పుడు కచ్చితంగా చెయ్యను అనుకున్న వాళ్లు కూడా చేస్తారు. నయనతార గారి విషయంలో కూడా అదే జరిగిందని అనుకుంటున్నాను. నయనతార చాలా హానెస్ట్. తనకు అనిపించింది చేస్తుంది తను బలంగా ఒకటి బిలీవ్ చేసినప్పుడు కచ్చితంగా చేస్తుంది.
ఈ సినిమా కోసం చిరంజీవి గారి స్టైల్ కి మీరు వెళ్ళారా లేకపోతే ఆయన్ని మీ స్టైల్ చేశారా?
-చిరంజీవి గారి లాంటి మెగాస్టార్ ఉన్నప్పుడు ఆయనకు తగ్గట్టు మాస్ ఎలిమెంట్స్ ఉండాలి. యాక్షన్ ఫన్ ఉండాలి ఆయన ఇమేజ్ ని ఎక్కడ వదలకుండా ఆయన ఇమేజ్ ని కొనసాగిస్తూ ఆ స్కేల్ మైంటైన్ చేయడం జరిగింది.
-శంకర వరప్రసాద్ గారు అనే పాత్ర ఎలా బిహేవ్ చేస్తుంది అని తెలుసుకున్నప్పుడు చిరంజీవి గారు ఆటోమేటిక్ ఆ క్యారెక్టర్ లోకి వెళ్లిపోయారు. ఇందులో కొన్ని సెల్ఫ్ సెటైర్స్ కూడా ఉంటాయి. అవి కూడా చాలా ఫన్ ఫుల్ గా ఉంటాయి. .ఈవెంట్ లో ఆయన ‘వావ్’ అనే మాట వచ్చినప్పుడు ఆయన కనెక్ట్ అయిన విధానం చూస్తే నిజంగా చిరంజీవి గారికి హ్యాట్సాఫ్ చెప్పాలనిపిస్తుంది. అది జనాలు కనెక్ట్ అయినదే.. ఆయన చాలా ప్లే ఫుల్ గా చెప్పడం జరిగింది.
ఇద్దరు బిగ్ స్టార్స్ ని ఎలా బ్యాలెన్స్ చేశారు?
బాలన్స్ అంటే మామూలుది కా.దు అది రేపు సినిమాలో చూస్తారు( నవ్వుతూ) చిరంజీవి గారు వెంకటేష్ గారు నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. వారి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. దీంతో నాకు అంత కేక్ వాక్ అయింది. చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసి చేసిన 18 రోజుల షూటింగ్ నా కెరియర్ లో వెరీ మెమొరబుల్.
-చిరంజీవి గారిని చిరంజీవి గారికి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఆడియన్స్ కి ఒక మెమొరబుల్ ఫీలింగ్ ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయం. అది మీరు సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారు వెంకటేష్ గారు ఎంత అద్భుతమైన నిర్ణయం తీసుకొని చేశారో అని అనిపిస్తుంది. వాళ్ళు సోలో హీరోలుగా కొన్ని వందల సినిమాలు చూసాము. ఇలాంటివి మాత్రం చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి వాటికి హీరోలే స్వాగతించడం అనేది చాలా గొప్ప విషయం. మంచి కథల కుదిరితే ఇలానే అద్భుతాలు అవుతాయి.
-చిరంజీవి గారు, వెంకటేష్ గారి కాంబినేషను 20 నిమిషాలు నాన్ స్టాప్ ఉంటుంది. ఇందులో వెంకటేష్ గారు కర్ణాటక నుంచి వచ్చిన వెంకీ గౌడ అనే ఒక మైనింగ్ బిజినెస్ మాన్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
సంక్రాంతికి వస్తున్న సినిమాలన్నీ కూడా ఫుల్ ఎంటర్టైనర్స్ కదా.. ఏదైనా కాంపిటీషన్ అనిపిస్తుందా?
-సంక్రాంతికి ఎంటర్టైన్స్ అద్భుతంగా వర్కౌట్ అవుతాయి. కంటెంట్ బాగుంటే అన్ని సినిమాలు ఆడుతాయి. గతంలో సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో దుమ్ము దులిపేసాయి. ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలన్నీ కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను
అనిల్ గారు మీరు క్రిటిసిజం, మీమ్స్ ని ఎలా తీసుకుంటారు?
నేను హర్ట్ అవ్వండి. నేను తిట్టినా నవ్వుతా పొగిడినా నవ్వుతా. చాలా పాజిటివ్ గా ఉంటాను.
చిరంజీవి గారు ఇందులో కొన్ని సన్నివేశాలని తొలగించేస్తారని చెప్పారు..ఎలాంటి సీన్స్ తొలగించారు?
-ఇందులో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ బ్లాక్ ని కట్ చేశాము. అది కథకి కాస్త అడ్డుపడుతోంది. అందుకే కట్ చేయడం చేయాల్సి వచ్చింది.
చిరంజీవి గారు ఈ సినిమాని అనుకున్న బడ్జెట్ లోనే చేశారని చెప్పారు కదా మీ ప్లానింగ్ ఎలా ఉంటుంది?
-ప్రీ ప్రొడక్షన్, సినిమా జరుగుతున్నప్పుడు ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ తగ్గించుకోవాలి, వర్కింగ్ డేస్ ఎన్ని ఇవన్నీ కూడా ప్రొడ్యూసర్స్ కంటే నేనే ఎక్కువ కేర్ తీసుకుంటాను. ప్రతిరోజు బడ్జెట్ నాకు వాట్సాప్ లో వస్తూ ఉంటుంది. నేను సొంత ప్రొడ్యూసర్ లాగా ఫీల్ అయి సినిమా చేస్తుంటాను. ప్రొడ్యూసర్ తన లైఫ్ ని ఫణంగా పెట్టి సినిమా చేస్తారు. ఒక పది రూపాయలు సంపాదించకపోయిన పర్లేదు కానీ బయటకు వచ్చే సమయానికి సేఫ్ గా ఉండాలి. ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉంటే చాలు. లక్కీగా నేను చేసిన నిర్మాతలు అందరికీ రిలీజ్ ముందు రిలీజ్ తర్వాత చాలా హ్యాపీ.
చిరంజీవి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి పాటలు కి డాన్స్ చేస్తూ పెరిగాను.ఆయన్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు నా ఫీలింగ్ ని మాటల్లో చెప్పలేను. ఒక్కసారిగా నా బాల్యంలోకి వెళ్ళిపోయాను. చిరంజీవి గారు వెంకటేష్ గారు అంటే నాకు చాలా గౌరవం. మా ముగ్గురు చాలా మంచి అనుబంధం ఉంది. చాలా పాజిటివ్ ఈ సినిమాని చేయడం జరిగింది. ఖచ్చితం చిరంజీవి గారు, వెంకటేష్ గారితో ఒక ఫుల్ లెంత్ సినిమా చేయడానికి ప్రయత్నిస్తాను.
ఈ సినిమా, సంక్రాంతికి వస్తున్నాం సినిమాని బీట్ చేస్తుందని అనుకుంటున్నారా?
-అది ప్రేక్షకులు డిసైడ్ చేయాలి. ఆ సినిమా కంటే అద్భుతంగా ఆడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అయితే సినిమాకి అన్ని వైపుల నుంచి వస్తున్న హైప్ చూస్తుంటే కచ్చితంగా ఒక పెద్ద ఓపెనింగ్ లాగా కనిపిస్తోంది. కచ్చితంగా ఇలాంటి సినిమా కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి వస్తున్నాం సినిమాని ఇది బీట్ చేయాలని కోరుకుంటున్నాను.
మీరు చేయబోయే కొత్త సినిమా గురించి?
-ఇంకా ఏది అనుకోలేదు. నేను సినిమా తర్వాత ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకున్నది లేదు. ఈ సినిమా తర్వాత ఒక రెండు వారాలు రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నాను.
నాగార్జున గారితో ఎప్పుడు సినిమా చేస్తున్నారు?
-అందరూ అదే అడుగుతున్నారు. నేను కూడా అదే నేను అదే ఫీల్ అవుతున్నాను. ఆయనతో కూడా సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఆ సినిమా చేస్తే నలుగురు అగ్ర కథానాయకులతో సినిమా చేసిన రికార్డు నాకే ఉండిపోతుంది.






