The Paradise: నాని బర్త్ డే కు స్పెషల్ ట్రీట్
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ది ప్యారడైజ్(The Paradise). ఆల్రెడీ గతంలో నాని- శ్రీకాంత్ కలయికలో వచ్చిన దసరా(Dasara) సినిమా మంచి రిజల్ట్ ను అందుకోవడంతో ఇప్పుడు వస్తున్న ది ప్యారడైజ్ పై అందరికీ మంచి అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా శ్రీకాంత్ ది ప్యారడైజ్ ను తెరకెక్కిస్తున్నాడు.
దానికి తగ్గట్టే ది ప్యారడైజ్ నుంచి రా స్టేట్మెంట్(Raw Statement) పేరుతో వచ్చిన గ్లింప్స్ కు కూడా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ మూవీపై ఉన్న అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా మార్చి 26న రిలీజ్ కానుందని మేకర్స్ సినిమా మొదలుపెట్టినప్పుడే చెప్పారు. కానీ ఇప్పుడా సినిమా వాయిదా పడుతున్నట్టు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమా షూటింగ్ అనుకున్న ప్రకారం అవకపోవడం చేత ది ప్యారడైజ్ రిలీజ్ వాయిదా పడుతుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి నాని బర్త్ డే సందర్భంగా వచ్చే నెల 24వ తేదీన ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేయనున్నారని, ఆ వీడియోతో పాటూ కొత్త రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసే అవకాశముందని సమాచారం. త్వరలోనే దీనిపై అప్డేట్ వచ్చే అవకాశముంది.






