Iran: ఇరాన్ పై అమెరికా దాడి చేస్తుందా…?
ఇరాన్ (Iran Protests)లో కొన్ని రోజులుగా జరుగుతోన్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో ఆందోళన కారులు ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ఆందోళన కారులను .. ఇరాన్ రివల్యూషనరీ ఆర్మీ అరెస్ట్ కూడా చేసింది. అయితే ఈ నిరసనలు ఎంతకూ సద్దుమణగకపోవడం.. ఇరాన్ అధినాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. తమకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగిన వారిని దేశద్రోహులుగా పరిగణించి, కఠినంగా శిక్షిస్తామని ఇరాన్ హైకమాండ్ స్పష్టం చేసింది.
తమ దేశంలో ఆందోళనలకు దిగుతున్న ఆందోళనకారులను అదుపు చేసేందుకు టెహ్రాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అవసరమైన చోట్ల బలప్రయోగానికి వెనకాడడం లేదు. దీంతో టెహ్రాన్ కు వాషింగ్టన్.. గట్టి హెచ్చరికలే జారీ చేసింది. గతంలోలా ఆందోళనకారులను చంపడం మొదలు పెడితే… ఇజ్రాయెల్ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా ఇరాన్ స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తోంది. వారికి సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది’’ అని నిరసనకారులకు మద్దతుగా పోస్టు పెట్టి కలకలం రేపారు ట్రంప్.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చేసిన పోస్టుపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. తమపై అమెరికా (USA) దాడి చేస్తే.. ఆ దేశంతో పాటు ఇజ్రాయెల్ తమ లక్ష్యాలుగా మారతాయని హెచ్చరించింది. తాజా పరిణామాలతో ఇరాన్ (Iran) పార్లమెంట్ సమావేశమైంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై చట్టసభ సభ్యులు చర్చించారు. ఈ క్రమంలోనే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్.. అమెరికా, ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు చేశారు. సభలో పలువురు సభ్యులు అమెరికాకు వ్యతిరేకంగా, తమ సుప్రీం లీడర్ ఖమేనీకి అనుకూలంగా నినాదాలు చేశారు.
ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పడిపోవడం, జీవన వ్యయాలు పెరగడం వంటి సమస్యలతో డిసెంబర్ 28 నుంచి ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగుతోంది. .
మరోవైపు ట్రంప్ పోస్టు నేపథ్యంలో.. ఇజ్రాయెల్ (Israel) అప్రమత్తమైంది. ఇరాన్ మద్దతు ఉన్న హమాస్ మిలిటెంట్లు 2023లో ఈ దేశంపై దాడులకు తెగబడ్డారు. అలాగే మరో గ్రూప్ హెజ్బొల్లాతోనూ.. ఇజ్రాయెల్ పోరాటం చేసింది.






