Krishna Statue: అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ గారి కాంస్య విగ్రహావిష్కరణ
-తాతయ్య సూపర్ స్టార్ కృష్ణ గారు గర్వపడేలా చేయడమే నా జీవితాశయం: హీరో జయకృష్ణ
భారతీయ సినీ పరిశ్రమకి అపూర్వమైన సేవలు అందించిన పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ గారి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవాడలోని లెనిన్ సెంటర్లో అత్యంత ఘనంగా జరిగింది. కృష్ణ గారి మనవడు ఘట్టమనేని జయకృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణగారి సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, అగ్ర నిర్మాత అశ్వినిదత్, సినీ రాజకీయ ప్రముఖులు, సూపర్ స్టార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కృష్ణ గారికి ఘన నివాళులు అర్పించారు.
విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో హీరో జయకృష్ణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. కృష్ణ గారిని సెలబ్రేట్ చేసుకుంటూ కలవడం ఇంకా సంతోషంగా ఉంది. నేను ఏం చేసినా ఆయన నా పక్కనే ఉంటూ నడిపిస్తుంటారనిపిస్తోంది, ఈరోజు కూడా ఆయన నా పక్కనే ఉన్నారు అనిపిస్తుంది. ఆయనతో గడిపిన సమయం ఆయన నాకు చెప్పిన మాటలు, ఎప్పుడూ గుర్తొస్తూనే ఉంటాయి. నా జీవితంలో మరో ముఖ్యమైన వ్యక్తి మా బాబాయ్ మహేష్ బాబు గారు. ఆయన నాకు ఎప్పుడూ గైడెన్స్ సపోర్ట్ ఇస్తారు. నేను ఆయనకి వీరాభిమానిని. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. నిన్న ఆయన నా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. అది నాకు నా జీవితంలో ప్రౌడ్ మూమెంట్. మహేష్ బాబు గారు నా ఇన్స్పిరేషన్. 40 ఏళ్ల క్రితం ఇదే రోజు అగ్నిపర్వతం సినిమా రిలీజ్ అయింది. అశ్విని దత్ గారు ఆ సినిమాని నిర్మించారు. మహేష్ బాబాయ్ ని కూడా ఆయనే లాంచ్ చేశారు.
ఈ ఏడాది ఆయన నన్ను లాంచ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆయన నన్ను ఇంత బలంగా నమ్మినందుకు థాంక్యూ. నేను నా బెస్ట్ ఇస్తాను. బంగారు తాతయ్య గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు మీ ముందు ఉన్నానంటే అది ఆయన వల్లే. అలాగే కిరణ్ గారికి కూడా ధన్యవాదాలు. మీరందరూ వచ్చి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీరందరూ ఎంత ప్రేమ చూపిస్తున్నారు అంటే దానికి కారణం తాతయ్య కృష్ణ గారే. ఈ సంవత్సరం నా మొదటి సినిమా శ్రీనివాస మంగాపురం లాంచ్ అవుతుంది. యాక్షన్ లవ్ స్టోరీ. కథ చాలా బాగుంటుంది. అజయ్ భూపతి గారు అద్భుతంగా తీస్తున్నారు. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను మంచి సినిమాలు మంచి కథలు తో మీ ముందుకు వచ్చే మీ అందరిని గర్వపడేలా చేస్తాను. మీ సపోర్టు ఎప్పుడూ నాతో ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్యు.
ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులకు, కృష్ణగారి అభిమానులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సుధా స్వామి బుజ్జి జితేంద్ర ముగ్గురు రెండు సంవత్సరాలుగా చాలా కష్టపడి అనుమతులు తీసుకుని ఈ విగ్రహాన్ని కట్టించడం అహర్నిశలూ కష్టపడి ఈ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం అభినందనీయం. కృష్ణ గారికి ఈ ప్రాంతం మీద ఎంతో అభిమానం ఉంది. ఆయన తొలి చిత్రం అలంకార్ థియేటర్లో రిలీజ్ అయింది. అగ్నిపర్వతం లాంటి బ్లాక్ బస్టర్ అప్సర థియేటర్ లో అద్భుతంగా ఆడింది. ఇక్కడున్న ప్రతి ధియేటర్ తో ఆయనకి మరపురాని గుర్తులున్నాయి. అశ్విని దత్ గారికి మా కుటుంబంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. కృష్ణ గారితో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. మహేష్ బాబు గారిని రాజ్ కుమారుడుతో పరిచయం చేశారు. ఈరోజు జయకృష్ణని పరిచయం చేస్తూ శ్రీనివాస మంగాపురం సినిమా చేస్తున్నారు. కృష్ణ గారి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదం అభిమానం జయకృష్ణ బాబు మీద ఉండాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్నిఅద్భుతంగా జయప్రదం చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ మాట్లాడుతూ.. కృష్ణ గారు 350 సినిమాలు చేశారు. ఆయన ఇంకా చేస్తారని కూడా నేను తిరిగాను. ఆ తర్వాత మహేష్ బాబుని ఇచ్చారు. ఆయన ఎంత అద్భుతంగా నిలిచారో మీ అందరికీ తెలుసు. ఇప్పుడుజయకృష్ణ గారిని ఇంట్రడ్యూస్ చేయడం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాను. సినిమా మీరందరూ చూడాలి. చూసి ఆనందించి నాకు చెప్పాలి.
డైరెక్టర్ అజయ్ భూపతి మాట్లాడుతూ.. అందరికీ ఫ్యాన్స్ ఉంటారు కానీ కృష్ణ గారికి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. కృష్ణ గారి గురించి వింటేనే గూస్ బంప్స్ వస్తాయి మహేష్ బాబు గారు నిన్న మా పోస్టర్ ట్విట్ చేశారు. ఆయనకి సినిమా గురించి ప్రతిదీ తెలుసు. నాకు అశ్విని దత్ గారు కిరణ్ గారు ఈ అవకాశం ఇవ్వడమే గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. చాలా నిజాయితీగా ఈ సినిమా తీస్తున్నాను. జయకృష్ణ నెక్స్ట్ సూపర్ స్టార్ అవుతాడు. తన స్క్రీన్ ప్రన్స్ అద్భుతంగా ఉంది. శ్రీనివాస మంగాపురం మీ అందరికీ నచ్చుతుంది. అతి త్వరలోనే పాటలు రిలీజ్ చేయబోతున్నాం. పాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కృష్ణ గారి లెగసి కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్యు
ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ… సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహావిష్కరణలో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఫ్యాన్స్ ని ఒక కల్ట్ లాగా తీసుకెళ్లిన మహానుభావుడు సూపర్ స్టార్ కృష్ణ గారు. గుడివాడలో కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం సిద్ధమవుతోంది. త్వరలోనే ఆవిష్కరించబోతున్నాము.
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ… అశ్విని దత్ గారి హస్తవాసి చాలా మంచిది. ఎంతో మంది కొత్త నటులని సూపర్ స్టార్ గా చేశారు. ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన మా విజయవాడ కి చెందిన వ్యక్తి కావడం మా అందరికీ ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. కృష్ణ గారి కుటుంబం నుంచి కృష్ణ గారి మనవడు జయకృష్ణ హీరోగా పరిచయం కాబోతున్నారు. జయకృష్ణ సినీ పరిశ్రమల గొప్ప విజయాలను అందుకోవాలని ఆశీర్వదిస్తున్నాను.
బుద్ధ వెంకన్న మాట్లాడుతూ.. 40 సంవత్సరాల క్రితం ఇదే చోట కృష్ణ గారు నటించిన అగ్నిపర్వతం సినిమా మనందరం ఎంతగానో ఆస్వాదించాం. అదే రోజున ఆయన విగ్రహం ఎక్కడ ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది.జయకృష్ణని సూపర్ స్టార్ ను చేయాలని కృష్ణ గారు ఎప్పుడు అనేవారు. ఎక్కడున్నా ఆయన ఆశీర్వాదం జయకృష్ణ పై ఉంటుంది. కృష్ణగిరి అభిమానులు మహేష్ గారి అభిమానులు అందరూ కూడా జై కృష్ణుని ఆశీర్వదించి పూర్తి సహకారం అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ.. కృష్ణ గారి విగ్రహాన్ని విజయవాడ మహానగరంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. కృష్ణ గారు అంటే మంచితనానికి మారుపేరు. అందరి గుండెల్లో ఒక సూపర్ స్టార్ గా చిరస్థాయిగా నిలిచారు. ఆయన ప్రతి సినిమా ఒక ఆణిముత్యం. కృష్ణ గారి మనవడు జయకృష్ణ సినిమా రంగంలోకి వస్తున్నాడు. తను కూడా అద్భుతమైన విజయాలని అందుకోవాలని కోరుకుంటున్నాను.మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. విజయవాడ మహానగరంలో సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఘట్టమనేని కుటుంబం నుంచి నెక్స్ట్ జనరేషన్ హీరోగా వస్తున్న జయకృష్ణ కి మనందరం అభినందించాలి. ప్రజల్లో చైతన్యం కలిగించే చిత్రాలు తీసి మనందరి మధ్యలో చిరస్థాయిగా నిలిచిన కృష్ణ గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది.
ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. కృష్ణ గారికి విజయవాడతో ఎంతో అనుబంధం ఉంది. విజయవాడ ప్రజలకు కూడా కృష్ణ గారు అంటే అపారమైన అభిమానం. ఆ కుటుంబంతో నాకు కూడా మంచి అనుబంధం ఉంది. జయకృష్ణ మహేష్ బాబు లాగా చక్కని అందమైన హీరో లాగా మీ ముందుకు వస్తున్నాడు. అశ్విని దత్ గారు వారిని లాంచ్ చేస్తున్నారు. ఇది ఘనవిజయం సాధించబోతోంది. ఈ అద్భుతమైన విగ్రహాన్ని స్థాపించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. జయకృష్ణ మరో సూపర్ స్టార్ గా రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. కృష్ణ గారి అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మంచికి మారుపేరు కృష్ణ గారు. సూపర్ స్టార్ అంటే కృష్ణ గారే. కృష్ణ గారి మనవడు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నారు. కృష్ణ గారిని మహేష్ బాబు గారిని ఆశీర్వదించిన అందరూ జయకృష్ణని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఆర్ఎక్స్ 100 సినిమాతో మీ అందరిని అలరించిన అజయ్ భూపతి దర్శకత్వంలో జై కృష్ణ హీరోగా మీ ముందుకు వస్తున్నాడు. ఘట్టమనేని మూడో జనరేషన్ జయకృష్ణ. కృష్ణ గారి అభిమానులందరికీ మనవడు, మనవాడు జయకృష్ణకి అద్భుతమైన విజయాలని ఇవ్వాలని కోరుకుంటున్నాను.






