Samantha: వైట్ శారీలో మైమరిపిస్తున్న సమంత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సమంత రూత్ ప్రభు(Samantha Ruth Prabhu) రీసెంట్ గా రాజ్ నిడుమోరు(Raj Nidimoru)ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సినిమాల్లో నటిస్తూ, మరోవైపు సినిమాలను నిర్మిస్తున్న సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. తాజాగా సమంత నటిస్తున్న మా ఇంటి బంగారం(Maa Inti Bangaram) టీజర్ ట్రైలర్ రిలీజవగా, ఆ ఈవెంట్ కోసం సమంత అందంగా ముస్తాబై ఆ ఫోటోలను నెట్టింట షేర్ చేయగా ఆ ఫోటోల్లో సమంత చాలా అందంగా కనిపించింది. ఈ ఫోటోల్లో సమంత వైట్ కలర్ శారీ, రోజ్ కలర్ బ్లౌజ్ ధరించి సింపుల్ జ్యువెలరీ ధరించి అందరినీ తన లుక్స్ తోనే ఆకట్టుకుంటుంది. సమంత షేర్ చేసిన ఈ ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.






